జియో ఆఫర్లతో టెలికాం రంగంలో రాబడి మాంద్యం

RELIANCE
RELIANCE Jio Offer

జియో ఆఫర్లతో టెలికాం రంగంలో రాబడి మాంద్యం

న్యూఢిల్లీ, జూన్‌ 21: రిలయన్స్‌జియో అందిస్తున్న ఉచిత డిస్కౌంట్‌ ఆపర్ల ద్వారా మొత్తం చందాదారులు 11.7 శాతం టెలికాం రంగ రాబడులు తగ్గేందుకు దోహదం చేసింది. ప్రతి త్రైమాసికం వారీగాచూస్తే 8.5శాతం చొప్పున టెలికాం రంగం సంస్థలకు రాబడులు తగ్గుతు న్నట్లు జెఫరీస్‌ సంస్థ అంచనావేసింది. రిలయన్స్‌జియో చందాదారుల్లో వృద్ది, ఆ సంస్థ ఉచిత ఆఫర్లు నాలుగోత్రైమాసికం చివరివరకూ 11.7శాతం పెరిగింది. మెట్రో ఎసర్కిల్స్‌లో ఎక్కువ ఇతర సంస్థలకు తగ్గుదల నమోదయింది. ఈ మెట్రోనగరాల్లోనే స్మార్ట్‌ఫోన్‌ వాతావరణం భారీ వృద్ధితో ఉన్నందున జియోకు ఆస్కారం పెరిగింది. మార్చి చివరినాటికి 108 మిలి యన్లుగా ఉన్న చందాదారులు తాజాగా 11.7 కోట్లకు పెరిగారు. క్రియా శీలకంగా చందాదారులు 80 మిలియన్లు ఉంటారని సంస్థ అంచనావేసింది. అయితే ఈ సంస్థ కేవలం 4జి వాతావరణానికి మాత్రమే పరిమితం అయింది. భారత్‌లో మొత్తం 4జి స్మార్ట్‌ఫోన్‌ సేవలు 131 మిలియన్లుగా ఉన్నాయి. వీటిలో జియో 86శాతానికి మార్కెట్‌ వాటా సాధిస్తుందని అంచనా. టెలికాం రంగంలోని టాప్‌3 సంస్థల కలిపి రాబడుల్లో 76శాతం వాటాతో ఉన్నాయి. గతంలోని చరిత్రలను తిరగేస్తే చిన్న ఆపరేటర్లు టెలికాం రంగం పునరేకీకరణతో భారీ దెబ్బ తిన్నాయి. ఇక భారత్‌లో కేవలం ఐదు సంస్థలు మాత్రమే కొనసాగుతాయని అంచనా. భారతిఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ఐడియా జాయింట్‌ వెంచర్‌, జియో సంస్థలు మాత్రమే గట్టిపోటీతో నడుస్తాయని జెఫరీస్‌ అంచనావేసింది.