జియోధనాధన్‌తో పోటీసంస్థల రాబడులకు బ్రేక్‌!

Jio
Jio

జియోధనాధన్‌తో పోటీసంస్థల రాబడులకు బ్రేక్‌!

ముంబయి: బిలియనీర్‌ ముఖేష్‌ అంబానీ ప్రవేశపెట్టిన ఆర్‌జియో తాజా ఆఫర్‌తో మరోసారి టెలికాం రంగంలోని ఇతర కంపెనీలపై ఎక్కువ ప్రభావం పడేఅవకాశం ఉంది. ధనాధన్‌పేరుతో ఆర్‌జియో ట్రా§్‌ు నిబంధనలు ఉల్లంఘించి మరీ కొత్త ఆఫర్‌ ప్రవేశపెట్టిందని టెలికాం ఇతర సంస్థలు ఆరోపిస్తున్నప్పటికీ జియో సమ్మర్‌సర్‌ప్రైజ్‌ ఆఫర్‌ను నిలిపివేసిన తర్వాత ఆర్‌జియో కొత్త ఆఫర్లతో మళ్లీ వస్తామంటూ తన వెబ్‌సైట్లు, మైజియో యాప్‌లలో విస్తృత ప్రచారంచేసింది. అందుకు తగ్గట్లుగానే 303 ప్లాన్‌కాకుండా కొత్తగాధనాధన్‌ ప్లాన్‌ను ప్రవేశ పెట్టింది. 28 రోజుల వాలిడిటీతో వరుసగా మూడు నెలలపాటు ఉచిత ఆఫర్‌సేవలు అందుకోవడంతో పాటు డేటా వినియోగం కూడా భారీగా పెంచింది. ప్రస్తుతం టెలికాం రంగంలో కొనసాగుతున్న ఈ అనుచితపోటీవల్ల కస్టమర్లకు కొంత లాభమే అయినా సంస్టలపై ఆర్థికభారం తప్పదని రేటింగ్‌, విశ్లేషణ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి.

ఆర్‌జియో ప్రవేశపెట్టిన టారిఫ్‌లు టెలికాం రంగంలో విధ్వంసం సృష్టంచేవిగా ఉంటాయని కేవలం ఒకే సంస్థకు లాభంతోపాటు ఇతర సంస్థలు చావుతప్పి కన్నులొట్టపోయేటట్లు చేసే పరిణామాలు ఇవేనని కోటక్‌ ఈక్విటీస్‌ బ్రోకరేజి సంస్థ ప్రకటిం చింది. దీనివల్ల ఆర్‌జియో మినహాయించి భారత్‌ లోని టెలికాం రంగ సంస్థల్లో లాభాలు వార్షికపద్ధతి లో చూస్తే 60శాతం చొప్పున దిగజారుతాయని అంచనా. 2018 ఆర్థికసంవత్సరంలోనే 20వేల కోట్లవరకూ ఉంది. దీనికితోడు టెలికాంరంగంలోని వివిధ సంస్థల రుణభారం కూడా నాలుగు లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ సిఎల్‌ఎస్‌ఎ కూడా తన ఇటీవలి నివేదికలో జియో ధరల విధానంతో ఈ రంగంలోని ఇతర సంస్థల రాబడులను దెబ్బతీస్తాయని అంచనా వేసింది. రాబడులు 2018 ఆర్థికసంవత్సరంలో 184 లక్షల కోట్లకు చేరతాయని గడచిన తొమ్మి దేళ్లలో ఇవే కనిష్టస్థాయి రాబడులని అంచనావేసిం ది. ప్రస్తుతం స్టాక్‌ ఎక్ఛేంజిల్లో జాబితా అయిన కంపెనీల్లో ఎయిర్‌టెల్‌ వార్షిక పద్ధతిలో 25శాతం చొప్పున నిర్వహణలాభాల్లో తగ్గుదల కనిపిస్తోంది. 4400 కోట్లుగా ఉంది.

ఐడియా సెల్యులర్‌కు 45 శాతం నష్టం అంటే 1800 కోట్లుగా ఉంటుందని అంచనా. ఎయిర్‌టెల్‌తన ఆఫ్రికా కార్యకలాపాలు, డిటిహెచ్‌, వాణిజ్యసేవలు, సంస్థాగతసేవలు వంటి వాటిని మినహాయించినా రాబడులపై ఒత్తిడి పెరు గుతున్నది. ఐడియా పరంగాచూస్తే మార్చి త్రైమాసి కంలో నికరంగా రూ.1000కోట్లనష్టం చవిచూస్తుం దని అంచనా.ఏడాది క్రితం వరకూ ఐడియా 576 కోట్ల లాభాలతోనడిచింది. డిసెంబరులో 384 కోట్ల నికరనష్టం చవిచూసింది. వెయ్యికోట్ల నష్టం వాటి ల్లుతుందంటే ఎంతమేర భారీస్థాయిలో పోటీ నడు స్తుందో అవగతం అవుతుందని నిపుణులు చెపుతు న్నారు. ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ తరహాలో కాకుండా మార్చినెల త్రైమాసిక అంచనాలను పరిశీలిస్తే వార్షికపద్ధతిన బేరీజువేస్తే ఐడియా తన నిర్వహణ లాభం 7200 కోట్లుగా ఉంటుందని ంచనా.

సంస్థ రుణభారం 50వేల కోట్లుగా ఉంది. మూలధన వ్యయం ఏడువేల కోట్లుగా ఉంటుంది. వడ్డీఇతర ఖర్చులకోసం 4500 కోట్లు వ్యయం అవుతుంది. వీటిని చెల్లించేందుకు కూడా మళ్లీ నిధులు సేకరిం చాల్సి ఉంటుంది. ఈపరిస్థితుల్లో చిన్న ఆపరేటర్లకు మరింత కష్టం అవుతుందని అంచనా. తమ మార్కె ట్‌ వాటాను సైతంసుస్థిరం చేసుకునేందుకు మరిం త కష్టపడాల్సి ఉంటుంది. అలాగే ప్రతి వినియోగ దారుడి నుంచి వచ్చే సగటు రాబడి కూడా తగ్గుతు న్నది. తొలి త్రైమాసికంలో భారతి ఎయిర్‌టెల్‌ రూ.196 నుంచి 180కి తగ్గింది. అలాగే నాలుగో త్రైమాసికంలో 157 ఉన్న సగటు రాబడి 142కు తగ్గుతుందని అంచనా. ప్రతి త్రైమాసికం వారీగా చూస్తే సగటు రాబడులు కూడా దెబ్బ తింటున్నట్లు మోటీలాల్‌ ఓస్వాల్‌ అంచనావేసింది. దీనికితోడు జియో కొత్తగా ధనేఆధన్‌ పథకం కింద వన్‌జిబి 4జి డేటా మూడునెలల పాటు 309కే అందిస్తుం ది. ప్రైమ్‌సభ్యుల కోసమేనని ప్రకటించింది. నాన్‌ ప్రైమ్‌ సభ్యులు కూడా ఈ ఆఫర్‌ పొందేందుకు వీలుందని ఇందుకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. 509 చొప్పున ప్రైమ్‌ సభ్యులకు 2జిబిడేటా అందుతుంది. నాన్‌ప్రైమ్‌ సభ్యులైతే రూ.408, రూ.608లు చెల్లిస్తే సరిపోతుంది.