జియోతో పోటీగా ఎయిర్‌టెల్ ఆఫ‌ర్లు

AIRTEL
AIRTEL

న్యూఢిల్లీ: జియో ఆఫర్‌కు ధీటుగా ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ పోస్ట్‌పెయిడ్‌ వినియోగదారుల కోసం మరో ఆఫర్‌ను తీసుకొచ్చింది. రూ.999కే అపరిమిత లోకల్‌ కాల్స్‌, 50 జీబీ 3జీ/4జీ డేటాను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్‌ పాత, కొత్త పోస్ట్‌పెయిడ్‌ వినియోగదారులకు వర్తిస్తుంది. ఇప్పటికే ప్రీపెయిడ్‌ వినియోగదారులకు రూ.999 ప్లాన్‌ అందుబాటులో ఉంది. 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 4జీబీ 3జీ/4జీ డేటా, అపరిమిత లోకల్‌ కాల్స్‌ను అందిస్తోంది. జియో పోటీను తట్టుకునేందుకు ఎయిర్‌టెల్‌ ఇప్పటికే వరుస ఆఫర్లను ప్రకటిస్తోంది. ఇటీవలే రూ.799 ప్లాన్‌ను తీసుకొచ్చింది. 28 రోజుల వ్యాలిడిటీపై రోజుకు 3జీబీ డేటా, ఉచిత అపరిమిత కాల్స్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్‌ కేవలం ప్రీపెయిడ్‌ వినియోగదారులకు మాత్రమేనని ఎయిర్‌టెల్‌ పేర్కొంది. దీంతో పాటు 4జీ వినియోగదారుల కోసం రూ.1,399కే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను అందించనున్నట్లు ఎయిర్‌టెల్‌ ప్రకటించింది.