జిమ్‌లో వ‌చ్చిన ఐడియా అది

nagarjuna
nagarjuna

అఖిల్‌.. తన రెండో సినిమాకు హలో అనే క్యాచీ టైటిల్‌ ఫిక్స్‌ చేసుకున్నారు. ఈ టైటిల్‌ పెట్టింది దర్శకుడు విక్రమ్‌కుమారే అని అంతా అనుకుంటున్నారు. కానీ అదేమీ కాదట. స్వయంగా ఈ చిత్ర నిర్మాత, అఖిల్‌ తండ్రి నాగార్జునే ఈ టైటిల్‌ సజెస్ట్‌ చేశారట. ఈ టైటిల్‌ కంటే ముందు దాదాపు 50 పేర్లు అనుకున్నామని, కానీ వాటిలో ఏదీ యాప్ట్‌ అన్పిచంలేదని, ఏదీ ఫైనలైజ్‌ చేయలేదని, చివరికి హలో అనే మంచి టైటిల్‌ ఖరారైందని నాగ్‌ తెలిపారు. ఈ టైటిల్‌ ఆలోచన తనకు ఎలా వచ్చిందో ఒక ఇంటర్వ్యూలో తెలిపారాయన. ‘నాకు ఉదయం వ్యాయామం చేస్తున్నపుడు మంచి మంచి ఐడియాలు వస్తుంటాయి. హలో టైటిల్‌ ఐడియా కూడ అలాగే వచ్చింది. ఒకరోజు ఉదయం జిమ్‌లో ఉన్నపుడు మెరుపులాగా ఈ టైటిల్‌ తట్టింది. వెంటనే మా సుప్రియకు చెప్పి ఈ టైటిల్‌ రిజిస్టర్‌ చేయించమన్నాను. అయితే విక్రమ్‌కుమార్‌ ఇలాంటి టైటిల్‌ ఒప్పుకుంటాడన్న నమ్మకమైతే లేదు. కానీ అతడికి ఈ టైటిల్‌ చెప్పటం ఆలస్యం ఓకే చెప్పాడు. అలా ఈచిత్రానికి హలో టైటిల్‌ ఖారారైంది అని నాగార్జున వెల్లడించారు.