జిడ్డులేని ముఖకాంతి

CUTE
CUTE

జిడ్డులేని ముఖకాంతి

మన వంటింట్లో అందుబాటులో ఉండే వస్తువులతో సులువైన చర్మసంరక్షణ చేపట్టవచ్చు. సమయంతో పాటు, డబ్బూ ఆదా అవ్ఞతుంది. అందుకు ఏం చేయాలో చూడండి మరి.

ముఖంపై పేరుకున్న మురికి, జిడ్డును తొలగించే ప్యాక్‌ ఇది.

క్యారెట్‌, క్యాబేజి, టమాట ముక్కలను సమపాళ్లలో తీసుకుని మెత్తని పేస్టులా చేయాలి. ముందుగా ముఖాన్ని చల్లటి నీటితో కడిగేశాక, ఈ మిశ్రమాన్ని ప్యాక్‌లా వేయాలి. ఐదు నిమిషాలయ్యాక మునివేళ్లతో వలయాకారంలో మర్దన చేయాలి. ఆరాక చన్నీటితో ముఖం కడిగేసుకుని ముల్తానీ మట్టితో ముఖం, మెడకు ప్యాక్‌ వేయాలి. కాసేపయ్యాక కడిగేసి నాణ్యమైన మాయిశ్చరైజర్‌ రాస్తే చర్మం తాజాదనాన్ని సంతరించుకుంటుంది.
జిడ్డుతత్వం ఉన్నవారు ఇలా ప్రయత్నిస్తే ఎంతో ప్రయోజనం. ఏం చేయాలంటే…టమాట, కీరదోస ముక్కలను సమపాళ్లలో కప్పు చొప్పున తీసుకుని మెత్తగా రుబ్బాలి. దీనికి రెండు చెంచాల నిమ్మరసం కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. పది నిమిషాలయ్యాక చన్నీళ్లతో కడిగేయాలి. చర్మంపై అధిక జిడ్డు తొలగిపోయి నల్లమచ్చలు, మొటిమలు దూరమవుతాయి.

కప్పు ఓట్‌మీల్‌పొడికి అరకప్పు యాపిల్‌ గుజ్జు కలపాలి. ఈ మిశ్రమానికి రెండు చెంచాల నిమ్మరసం కలిపి ముఖానికి ప్యాక్‌ వేయాలి. పది నిమిషాల తరువాత ముఖం శుభ్రపరచుకుంటే తేడా మీకే తెలుస్తుంది. చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది.

అరకప్పు మెంతిపొడిలో కాసిని నీళ్లు కలిపి పేస్టులా చేసి ముఖం, మెడకు ప్యాక్‌ వేయాలి. పావ్ఞగంటయ్యాక చల్లటినీటితో కడిగేయాలి. అలానే చెంచా చొప్పున వేరుశనగనూనె, నిమ్మరసం తీసుకుని నల్లమచ్చలు ఉన్న ప్రాంతంలో మర్దన చేయాలి.

దాంతో పాటు గోరువెచ్చని పాలకు నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి రాయాలి. ఇది ముఖంపై మురికిని తొలగించి జిడ్డును వదలిస్తుంది. ఇదీ మంచి క్లెన్సర్‌లా పనిచేస్తుంది. ఎండబెట్టిన దానిమ్మ తొక్కలను పొడిచేసి నాలుగు చెంచాల నిమ్మరసం జోడించి పేస్టులా చేయాలి. ఈ మిశ్రమంతో ముఖానికి ప్యాక్‌ వేసుకుంటే మచ్చలు మాయమవుతాయి.

శీతాకాలం పొడిచర్మం వారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. చర్మం తెల్లగా మారి కాంతివిహీనంగా తయారవుతుంది. ఈ చర్మతత్వం ఉన్నవారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రాత్రిపడుకునే ముందు ఆలివ్‌ నూనెను వేడిచేసి అది గోరువెచ్చగా అయ్యాక ముఖం, చేతులకు రాస్తే మర్నాటికి చర్మం మృదువ్ఞగా తయారవ్ఞతుంది.

నీళ్లను వేడిచేసి దానిలో దూది లేదా పొడి వస్త్రాన్ని కొద్దిసేపు నానబెట్టి ముఖం తుడుస్తూ ఉండాలి. ఇలా ఇరవై నిమిషాలు చేసి చల్లటి నీటితో ముఖం కడు క్కుంటే మంచిది.

చెంచా తేనెలో చిటికెడు పంచదార కలిపి ముఖానికి మృదువుగా మర్దన చేస్తే మృతకణాలను తొలగిపోతాయి.