జిఎస్‌టి శ్లాబుల కుదింపు సాధ్యమే

Aravind subrahmanyan-1
Aravind subrahmanyan-1

జిఎస్‌టి శ్లాబుల కుదింపు సాధ్యమే

న్యూఢిల్లీ, నవంబరు 26: రాబోయే రోజుల్లో వస్తుసేవల పన్ను (జిఎస్‌టి)లో తక్కుం శ్లాబులు ఉండే అవకాశాలు లేకపోలేదని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణ్యం చెప్పారు. ఇప్పుడున్న 12శాతం, 18శాతం శ్లాబులను ఒకటిగా చేయడం ద్వారా ఇది సాధ్యం అవుతుందని కూడా ఆయన అన్నారు. అంతేకాకుండా జూలై 1నుంచి అమలులోకి వచ్చిన ఈ కొత్త పన్నుల విధానం మరో 6-9నెలల కాలంలో స్థిరపడవచ్చని, మిగతా దేశాలకు ఆద ర్శంగా కూడా మారుతుందని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు.

ఆ తర్వాత ఇప్పుడున్న 12శాతం, 18శాతం పన్నురేట్లను కలిపి ఒకేరేటుగా చేసే అవకాశం లేకపోలేదు. అంటే రాబోయే రోజుల్లో కొన్ని పన్ను శ్లాబులే ఉండవచ్చు. అయితే ఒకేపన్ను రేటు ఉండడం సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే దాన్ని సాధించడం కూడా కష్టం అని ఇక్కడ ఇక్ఫా§్‌ు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ లర్నింగ్‌లో మాట్లాడుతూ సుబ్రమణ్యం చెప్పారు.

జిఎస్‌టి విధానంలో రిటర్న్‌ లు దాఖలు చేసే వ్యవస్థల్లో కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఎదురైన విషయం నిజమేనని ఆయన అంగీకరించారు. రాష్ట్రాల్లో వేర్వేరు ఐటి వ్యవస్థలు ఉన్నాయని, అందువల్ల ఈ కొత్త వ్యవస్థ కొంత ఇబ్బందికరంగానే ఉండవచ్చని ఆయన అంటూ ఈ సమస్యలన్నీ జిఎస్‌టి కౌన్సిల్‌ పరిష్కరిస్తుందని చెప్పారు. జిఎస్‌టి అమలు గతంలో ఎన్నడూ చూడనటువంటి ఒక విప్లవాత్మకమైన ఆర్థిక సంస్కరణగా సుబ్రమణ్యం చెప్పారు.

ఇంతకుముందు కేంద్రంలోనూ, ప్రతి రాష్ట్రంలోనూ వారివారి సొంత పన్ను అధికారులు, సొంత ఐటి వ్యవస్థ లు ఉండే వి. అప్పుడు వ్యవస్థ ఎంత సంక్లిష్టంగా ఉండేదో చెప్పలేను. అందు వల్ల కొత్త విధా నానికి మారే సమయంలో కొంత ఇబ్బందులు ఎదురుకావడం లో ఆశ్చర్యం లేదు. అయితే ప్రభుత్వం ఈ కొత్త విధానం అమలుచేయడంలో మెరుగ్గానే పనిచేసిందని నేను అనుకుంటున్నాని ఆయన చెప్పారు. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని దిద్దుబాటు చర్యలు చేపట్టాలని జిఎస్‌టి కౌన్సిల్‌ నిర్ణయించిందని ఆయన పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న సాంకేతిక ఇబ్బందుల గురించి అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.