జిఎస్‌టి వార్షిక రిటర్నులకు గడువు పెంపు

GST-
GST-

జిఎస్‌టి వార్షిక రిటర్నులకు గడువు పెంపు

న్యూఢిల్లీ: పరోక్షపన్నుల శాఖ జిఎస్‌టి వార్షిక రిటర్నుల దాఖలు తుదిగడువును 2019 మార్చి 31వ తేదీవరకూ పొడిగించింది. క్లియర్‌టాక్స్‌ సిఇఒ అర్చిత్‌గుప్తా మాట్లాడుతూ జిఎస్‌టిఆర్‌-9 దాఖలుకు ఆన్‌లైన్‌లో ఇప్పటికీ ప్రారంబం కాలేదని, కొంతమేర పొడిగించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆడిట్‌ రిటర్నులు, ఆడిట్‌ ఫారాలను జిఎస్‌టిపరిధిలో రిటర్నులు దాఖలుకు మరోమూడునెలలు పొడిగించినట్లు జిఎస్‌టి నిర్ణాయక సంస్థ సిబిఐసి వెల్లడించింది. అంతకుముందు జిఎస్‌టిఆర్‌9, జిఎస్‌టిఆర్‌9ఎ, జిఎస్‌టిఆర్‌9సిలను విదిగా గడువులోపే చెల్లించాల్సి ఉండేది. జిఎస్‌టి పోర్టల్‌లో సత్వ రమే ఈ ఫారాలను అందుబాటులో ఉంచుతా మని సిబిఐసి వెల్లడించింది. ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ భాగస్వామి అభిషేక్‌జైన్‌ మాట్లాడుతూ పరిశ్రమరంగానికి కొంత గడువు పెంచాల్సిన అవసరం ఉందని, ఈ ఫారాల్లో నింపాల్సిన వివరాలకు సంబంధించిన గణాంకాలను సేకరించాల్సి ఉందని అన్నారు. కొనుగోళ్లు, వివరాలు మూడుకేటగిరీల ముడిసురుకులు, కేపిటల్‌గూడ్స్‌, సేవలు వంటివాటి వివరాలు అందాల్సి ఉందన్నారు. అయితే వీటిని నెలవారీ గాను, త్రైమాసికాలవారీగాను బిజినెస్‌ సంస్థల వారీగా గణాంకాలు అవసరం అవుతాయని చెపు తున్నారు. కెపిఎంజి భాగస్వామి హర్‌ప్రీత్‌సింగ్‌ మాట్లాడుతూ వార్షిక రిటర్నుల ఫార్మాట్‌ను మరింత సరళీకృతంచేయాలని నెలవారీ రిట ర్నులు మాత్రమే ఉంచాలని, మరిన్ని వివరాలు అనవసరమని పేర్కొన్నారు. అలాగే 2017-18 క్రెడిట్‌లకు తుదిగడువును పెంచాల్సి ఉంటుందని, ఇప్పటికే అక్టోబరు 25వ తేదీతో తుది గడువు ముగిసిందని అన్నారు. సెప్టెంబరు లావాదేవీలకు సంబంధించి మరికొంత గడువు పెంచాలని, లేదా వార్షిక ఫారాల్లోనే క్రెడిట్‌లకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. డిసెంబరు చివరికి తుదగడువు వాయిదా వేస్తే మంచిదని ప్రైస్‌వాటర్‌కూపర్స్‌ భాగస్వామి ప్రతీక్‌జైన్‌ పేర్కొన్నారు. దీనివల్ల తమ వార్షిక రిటర్నులకు గణాంకాలు సేకరించుకునేందుకు వ్యవధి సరిపోతుందని అన్నారు.