జిఎస్‌టి నిర్ణయాల్లో కాంగ్రెస్‌ పాత్ర అమోఘం

Chidambaram
Chidambaram

న్యూఢిల్లీ: ఏడాదిన్నర క్రితం కేంద్ర ప్రభుత్వం సృష్టించిన గందరగోళం నిన్నటి కౌన్సిల్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయంతో కొంత ఊరట లభించిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం అన్నారు. గురువారం జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో చిరు వ్యాపారులకు ఊరట కలిగించేలా వస్తు, సేవల పన్నులో కొన్ని మినహాయింపులు కల్పించింది. జిఎస్‌టి విధింపునకు ప్రాతిపదికగా తీసుకునే వ్యాపారుల వార్షిక టర్నోవర్‌ను రూ. 40 లక్షలకు పెంచింది. ఐతే ఈ మార్పులన్నీ కాంగ్రెస్‌ మంత్రుల చురుకుదనం వలనే జరిగాయని చిదంబరం అన్నారు. జిఎస్‌టితో కేంద్రం సృష్టించిన గందరగోళాన్ని కాంగ్రెస్‌ ఆర్ధిక మంత్రులు మండలి సమావేశాల్లో చురుకుగా పాల్గొని, కీలక సూచనలు చేసి ఈ నిర్ణయానికి తగిన పాత్ర పోషించారని ఆయన అన్నారు. తాజా నిర్ణయాలతో చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కొంత ఊరట లభించింది. కాంగ్రెస్‌ రాష్ట్ర ఆర్ధిక మంత్రులకు ధన్యవాదాలు అని చిదంబరం ట్వీట్‌ ద్వారా తెలిపారు.