జిఎస్‌టి అమలు గడువు జూలైకి వాయిదా

Arun Jaitley
Arun Jaitley

జిఎస్‌టి అమలు గడువు జూలైకి వాయిదా

న్యూఢిల్లీ: జిఎస్‌టి అమలు ఏప్రిల్‌ నుంచి జూలై నెలకు వాయిదా పడింది. జిఎస్‌టి జూలై నుంచి అమలుచేయనున్నట్టు  అరుణ్‌జైట్లీ తెలిపారు.కేంద్ర, రాష్ట్రాల సంయుక్త నియంత్రణ అంశంపై ఆమోదయోగ్యమైన నిర్ణయానికి రాగలిగామని అన్నారు. రూ.1.5 కోట్లు అంతకంటే తక్కువ టర్నోవర్‌ ఉండే వ్యాపారంపై 90శాతం మదింపును రాష్ట్రాలుచేపడుతాయని , 10శాతం మదింపును కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం చేపడుతుందని ఆయనచెప్పారు. అలాగే రూ.15. కోట్లు ఎక్కువగా ఉండే టర్నోవర్లపై కేంద్ర, రాష్ట్రాలు చెరొక 50శాతం చొప్పున మదింపుచేస్తాయని ఆయన అన్నారు. పశ్చిమ బెంగాల్‌ ఆర్థిక మంత్రి మినహా మిగిలిన అన్నిరాష్ట్రల మంత్రులు ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారని అన్నారు.