జిఎస్టీ పుణ్యమా అని రెండు దశల్లో ధరల పెంపు

Home Appliances
Home Appliances

జిఎస్టీ పుణ్యమా అని రెండు దశల్లో ధరల పెంపు

ముంబయి, జూలై 7: జిఎస్‌టి అమలు పుణ్యమా అని దేశవ్యాప్తంగా ఎయిర్‌కండిషనర్లు, వాషింగ్‌ మెషిన్లు, రిఫ్రిజిరేటర్లు ధరలు ఈ ఏడాదిలో రెండు సార్లు పెరుగుతాయని అంచనా. వీడియోకాన్‌, పానసోనిక్‌, ఎల్‌జి, విర్ల్‌పూల్‌ వంటి కంపెనీలు తక్షణమే ధరలు పెంచినా ఈ పెంపు ప్రయోజనాలు కస్టమర్లకు ఎలాంటి అదనపు భారం లేకుండా చూసుకుంటూ తమ మార్కెట్‌ను పెంచుకుంటున్నా యి. ఇటీవలికాలంలో ఈమెటిరియల్స్‌ధరల పెంపు భారంఅయిన పండుగల సీజన్‌పరంగా ఆఫర్ల రూపంలో కస్టమర్లకు బదలాయించారు. ఉక్కు, రాగి, ప్లాస్టిక్‌ ఉత్పత్తులధరలు ఫిబ్రవరినుంచి పెరు గుతున్నాయి. ఇతర విఢిభాగాలు ఎసిలకు కంప్రె సర్లు, రిఫ్రిజిరేటర్లు వంటివాటిపై నాలుగుశాతం పెరిగాయి.

టివిప్యానెళ్లపై మూడుశాతంపెరిగాయి. ఇక మార్జిన్‌ల ఒత్తిడి కారణంగా కంపెనీలు ధరల పెంపును పండగసీజన్‌ పూర్తయ్యేంతవరకూ ఆగా యి. టివిప్యానెళ్లపై పెరిగిన ధరల భారం మాత్రం వినియోగదారులకే వెళుతుందని ఒక బహుళజాతి సంస్థ భారతీయ అధిపతి వెల్లడించారు. జిఎస్‌టి వచ్చిన తర్వాత ధరలపెంపుపై నిర్ణయం తీసుకో లేదని, అంతేకాకుండా ప్రస్తుతంఉక్కు,రాగి, ప్లాస్టిక్‌ ధరల పెరుగుదల ప్రభావాన్ని మదింపుచేస్తున్నట్లు కంపెనీలు చెపుతున్నాయి. ఇక ఉత్పత్తిదారులైతే మార్జిన్లప్రభావంతో ఒత్తిడికిలోనవుతున్నారు. అందు వల్లనే ధరలపెంపును వాయిదావేసుకుంటున్నారు. జిఎస్‌టి అమలు రెండోభారంగా వస్తోంది. దీనివల్ల పన్నులభారంపరంగా నాలుగుశాతం అదనంగా వసూలుచేయాల్సి ఉంటుంది. ఇక కంపెనీలైతే అద నపు వ్యయాన్ని ఎట్టిపరిస్థితుల్లోను భరించలేవు. అందుకే ధరల పెంపు అనివార్యం అని ఈ భారం అంతటినీ వినియోగదారులపైనే రుద్దేస్తారన్న అంచ నాలున్నాయి. టివిలు, రిఫ్రిజిరేటర్లు, మైక్రోవేవ్‌ ఒవెన్స్‌ 3-4శాతం పెరుగుతాయని, పానసోనిక్‌ కంపెనీ చెపుతోంది. అదనపు పన్ను భారం మొత్తం కస్టమర్లపైనే పడుతుంది.

రెండుసార్లు ధరలు పెంచ డం వల్ల కస్టమర్లకు మరింత భారం అవుతుందని అంచనా. వీడియోకాన్‌ కంపెనీ 2.5శాతం తక్షణమే పెంచి ఆతర్వాత మరికొంత పెంచాలని నిర్ణయించి నట్లు తెలుస్తోంది. విడిభాగాలధరలు పెరగడం కొంత మార్కెట్‌కు భారమేనని, అందువల్ల రానున్నకాలంలో ధరలు పెరుగుతాయని వీడియోకాన్‌ సిఒఒ సిఎం సింగ్‌ వెల్లడించారు.ఇతర వినియోగరంగ కంపెనీలు, ఎలక్ట్రానిక్స్‌ కంపెనీల పరంగాచూస్తే సీజన్‌లేనపుడు ధరలు పెంచితే మరింత భారం అవుతుందని, అందువల్ల పండుగ సీజన్‌ వచ్చేంతవరకూ వేచిచూడాల్సిందేనని పేర్కొం టున్నాయి. ఇపుడు కేవలం అదనపు పన్ను భారం మాత్రమే కస్టమర్లకు కేటాయిస్తామని దీనివల్ల పెద్దగాభారం పడదని బ్రాండెడ్‌ కంపెనీలు చెపుతు న్నా ముడిసరుకుల ధరలుపెరగడం, వాటిపై పన్ను ల భారం పెరుగుతుండటంతో భవిష్యత్తులో మరోసారి ధరలు పెరుగుతాయని కంపెనీలే అంగీకరిస్తున్నాయి.