జింబాబ్వేపై శ్రీలంక గెలుపు

Srilanka Batting1
Srilanka Batting1

జింబాబ్వేపై శ్రీలంక గెలుపు

కొలంబో: సొంతగడ్డపై శ్రీలంక జోరు కొనసాగుతోంది. జింబాబ్వేతో గురువారం జరిగిన మూడో వన్డేలో ఆ జట్టు 310 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించేసి 8వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందు కుంది. ఓపెనర్‌ మసకద్ధ 98బంతుల్లో 15ఫోర్లు, ఒక సిక్స ర్‌తో 111పరుగులతో శతకం బాదడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే 8వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో ఓపెనర్లు డిక్వెల్లా 116 బంతుల్లో 14ఫోర్లతో 102 పరుగులు, గుణతిలక 111బంతుల్లో 15ఫోర్లు, ఒక సిక్స్‌తో 116పరుగు లతో శతకాలు బాదడంతో శ్రీలంక 47.2 ఓవర్లలోనే 312/2 విజయాన్ని అందుకుంది. ఛేదనలో తొలి వికెట్‌కి అభేద్యంగా 37ఓవర్లలోనే 229 పరుగుల భాగస్వామ్యాన్ని శ్రీలంక ఓపెనర్లు నెలకొల్పారు. దీంతో మ్యాచ్‌పై శ్రీలంక పట్టు బిగించేసింది. కానీ…8పరుగుల వ్యవధిలోనే ఓపెనర్లు ఔటైనా తర్వాత కుశాల్‌ మెండిస్‌ (28 నాటౌట్‌), ఉపుల్‌ తరంగ 32బంతుల్లో 44నాటౌట్‌తో గెలుపును లాంఛనంగా పూర్తి చేశారు. తొలి వన్డేలో జింబాబ్వే గెలవగా…తర్వాత రెండు వన్డేల్లోనూ గెలిచిన శ్రీలంక ఐదు వన్డేల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో నిలిచింది. నాలుగో వన్డే శనివారం జరగనుంది.