జార్జియాలో గడిపిన ‘గరుడవేగ’ టీమ్‌!

Rajasekhar in GARUDA VEGA
Rajasekhar in GARUDA VEGA

33 రోజులు జార్జియాలో గడిపిన ‘గరుడవేగ’ టీమ్‌!

పిఎస్‌వి గరుడ వేగ 126.18 ఎం చిత్రంలో డా.రాజశేఖర్‌ హీరోగా, ఆయన భార్యగా పూజా కుమార్‌ నటిస్తున్నారు. ఫేమ్‌ ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ పిఎస్‌వి గరుడవేగ 126.18ఎం. ఈ చిత్రాన్ని పలు అరుదైన లొకేషన్లలో రూపొందిస్తున్నారు. అందులో కీలకమైనది జార్జియా. అక్కడ 33 రోజులు చిత్రీకరణ జరిగింది. భారతీయ చిత్రాల్లో ఇప్పటివరకు వెండితెరపై కనిపించని లొకేషన్లలో ఈ చిత్రాన్ని చిత్రీకరించడానికి దర్శకుడు నిర్ణయించారు.

ఆ మేరకు యురాషియన్‌ కంట్రీస్‌లో దాదాపు 40 రోజులు చిత్రీకరించారు. wస్కిప్ట్‌ డిమాండ్‌ని బట్టి వాతావరణాన్ని పట్టించుకోకుండా నటీనటులు, సాంకేతిక నిపుణులు అక్కడికి వెళ్లి పనిచేశారు. ఇక్కడి అధికారులు పర్మిషన్స్‌ ను ఇప్పటించడంలో చాలా సపోర్ట్‌ చేస్తున్నారు. సెన్సిటివ్‌ ఏరియాల్లో కూడా షూటింగ్‌ చేయడానికి పర్మిషన్‌ ఇచ్చారు. స్టంట్‌ టీమ్‌ ప్రతిభను గురించి ఎంత చెప్పినా తక్కువే అని దర్శకుడు అన్నారు. రాజశేఖర్‌ మాట్లాడుతూ.. మేం పనిచేసిన లొకేషన్లకు 100 కిలోమీటర్ల పరిధిలో హోటళ్లు కూడా లేవు. అయినా టీమ్‌ మొత్తం క్యాంపుల్లోనే ఉన్నాం అని అన్నారు.