జామపండుతో వ్యాధులకు చెక్‌

GUAVA
GUAVA

జామపండుతో వ్యాధులకు చెక్‌

జామపండ్లలో సుమారు 15రకాలు ఉన్నాయి. పచ్చిజామకాయలలో మాలిక్‌, ఆక్సాలిన్‌, పాస్పారిక్‌, యాసిడ్స్‌ అనేవి ఉన్నందున ఇవి తింటే కడుపునొప్పి వస్తుంది. బాగా గింజలున్న కాయలు ఎక్కువగా తీసుకుంటే ఎపెండిసైటిస్‌ అనే వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఆరు కమలాపండ్లలో సి విటమిన్‌ ఎంత ఉంటుందో బాగా పండిన ఒక జామపండులో అంత ఉంటుంది. దంతాలు, చిగుళ్ల నుండి రక్తం కారువారు పచ్చి జామకాయలను కొరికి, బాగా నమిలి చప్పరించి ఊసివేస్తే రక్తం కారడం ఆగిపోతుంది. దంతా లకు ఎనలేని మేలు చేకూరుతుంది. చంటిపిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు పండిన జామగుజ్జుతో తేనె, పాలు కలిపి తినిపిస్తే బలవర్థకమైన టానిక్‌లా పనిచేస్తుంది. టివి ఉన్నవారు, గుండె బలహీనంగా ఉన్నవారు, కామెర్లవ్యాధి ఉన్నవారు, బహిష్టు నొప్పులున్నవారు మిగతా వైద్యచికిత్సలతో పాటు పై మిశ్రమాన్ని సేవిస్తుంటే వ్యాధులు శీఘ్రగతిన తగ్గుముఖం పడతాయి. ్పుుగతిన తగ్గుముఖం పడతాయి.