జాదవ్‌ మృతిపై సీఎం సంతాపం

TSCM KCR
K. Chandrasekhar rao

హైదరాబాద్‌: తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు, అణగారిన వర్గాల జనగొంతుక, పౌరహక్కుల సంఘం నేత కేశవరావు జాదవ్‌(86) అనారోగ్యంతో నేడు కన్నుమూశారు. ఆయన మృతి పట్ల సీఎం కెసిఆర్‌ సంతాపం ప్రకటించారు. జాదవ్‌ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. తెలంగాణ సాధన కోసం జాదవ్‌ చేసిన సేవలను ఈ సందర్భంగా సీఎం స్మరించుకున్నారు.