జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు ప్రభావం ఉండదు

ram madhav
ram madhav

విజయనగరం: టిడిపి ప్రభుత్వంపై ఏపిలో తీవ్ర వ్యతిరేకత పెరుగుతుందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌ అన్నారు. విజయనగరంలో శనివారం ఉత్తరాంధ్ర కార్యక్తల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..బిజెపి నేతలు టిడిపితో కలిసి నాలుగేళ్లు నీతిగానే పనిచేశారని ,చంద్రబాబు మధ్యలోనే ఆ బంధాన్ని తెంచేశారని అన్నారు. అందుకే ఏపి కార్యకర్తలలో ఉత్సాహం నింపేందుకు వచ్చే నెల ఏపిలో ప్రధాని మోది పర్యటన చేపట్టనున్నారని తెలిపారు. చంద్రబాబు చేపట్టిన మహాకూటమి విఫలం అయ్యిందని, జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు, కేసిఆర్‌ ప్రభావం ఉండబోదని జోస్యం చెప్పారు.