జాతీయ క్రీడా వర్సిటీ బిల్లుకు ఆమోదం

RAJA VARDHAN SINGH RATHODE
RAJA VARDHAN SINGH RATHODE

న్యూఢిల్లీ: జాతీయ క్రీడా విశ్వవిద్యాలయ బిల్లును ఇవాళ లోక్‌సభలో ఆమోదించారు. స్పోర్ట్స్‌ యూనివర్సిటీ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా క్రీడా మంత్రి రాజవర్దన్‌ సింగ్‌ రాథోడ్‌ మాట్లాడారు. అంతర్జాతీయ క్రీడాకారుడిని స్పోర్ట్స్‌ వర్సిటికి ఛాన్సలర్‌గా నియమిస్తామన్నారు. వర్సిటీ సభ్యుల్లో ప్లేయర్లు కూడా ఉంటారన్నారు. క్రీడలు రాష్ట్రం పరిధిలోకి వస్తాయని, గతంలో యూపిఏ వర్సిటీలు క్రీడా పోటీలను నిర్వహిస్తుంటాయని, ఐతే ఆ వర్సిటీలు క్రీడాస్పూర్తిని పెంపొందించే ప్రక్రియను అలవరుచుకోవాలని మంత్రి అన్నారు. ఆస్ట్రేలియాకు చెందిన కాన్‌బెర్రా వర్సిటీతో ఒప్పందం కుదుర్చుకున్నామని, మణిపూర్‌లో క్రీడా వర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి చెప్పారు.