జాంటీ రోడ్స్‌ కుమార్తె ‘ఇండియా కోహ్లీ అభిమాని

INDIA1
INDIA

జాంటీ రోడ్స్‌ కుమార్తె ‘ఇండియా కోహ్లీ అభిమాని

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్‌ కోహ్లీ అంటే మన భారతీయులకే కాదు,ఇండియాకు కూడా ఇష్టమే. ఇక్కడి ఇండియా అంటే మన భారతదేశం కాదు.ప్రముఖ దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌,ముంబయి ఇండియన్స్‌ ఫీల్డింగ్‌ కోచ్‌ జాంటీ రోడ్స్‌ కుమార్తె ఇండియా రోడ్స్‌.జాంటీ తన చిట్టితల్లిని ఒక రోజు సరదాగా బయటికి తీసుకెళ్లాడు.అక్కడ కోహ్లీ వ్యూమా కోసం చేసిన యాడ్‌ పోస్టర్‌ ఒకటి కన్పించింది.అది చూసి ఇండియా రోడ్స్‌ కోహ్లీ పోటో పట్టుకుని తెగ మురిసిపోయింది.వెంటనే జాంటీ ఇండియా పోటో తీసి ట్విటర్‌లో పోస్టు చేశాడు. కోహ్లీకి మరో అభిమాని దొరికనట్లుంది అని ట్వీట్‌ చేశాడు. ఇందుకు కోహ్లీ స్పందిస్తూ ఎంత ముద్దుగా ఉందో, ఇంతకీ ఇండియా తగిలించుకున్న బుల్లి బ్యాగ్‌లో ఏముందో అంటూ సరదాగా ట్వీట్‌ చేశాడు. వ్యూమాబ్రాండ్‌కి ప్రచార కర్తగా కోహ్లీ వ్యవరిస్తున్న సంగతి తెలిసిందే.