జవాన్‌ మొదటి లుక్‌

SAI DHARNATEj-2
SAI DHARNATEJ

జవాన్‌ మొదటి లుక్‌

సుప్రీమ్‌ హీరో సాయి ధరమ్‌తేజ్‌, మెహ్రీన్‌ ఫిర్జాదా జంటగా బివిఎస్‌ రవి దర్శకత్వం వహిస్తున్న చిత్రం జవాన్‌. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పణలో అరుణాచల్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తునానరు. ఇప్పటికే టాకీ పార్టు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇటలీలో రెండు పాటలు షూటింగ్‌ జరుపుకుంటున్నారు. ఈ నెల 23 నుండి హైదరాబాద్‌లో యాక్షన్‌ పార్టు చిత్రీకరిస్తారు. మిగిలిన షూటింగ్‌ పార్ట్‌ అంతా జూలైలో షూట్‌ చేసి ఆగస్టులో చిత్రాన్ని విడుదల చేయటానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రీ లుక్‌ పోస్టర్‌, టైటిల్‌కి చాలా మంచి స్పందన రావడంతో యూనిట్‌ సభ్యులు మరింత ఉత్సాహంతో ఉన్నారు. చిత్ర దర్శకుడు బివిఎస్‌ రవి జన్మదినోత్సవం సందర్భంగా ఈ చిత్రం మొదటి లుక్‌ ని విడుదల చేశారు. దిల్‌రాజు మాట్లాడుతూ సాయి తేజ్‌కు మా బ్యానర్‌కు మంచి రిలేషన ఉంది. బివిఎస్‌ రవి మా ప్రొడక్షన్‌కి మాకు మంచిరిలేషన్‌ ఉంది. జవాన్‌ స్టోరీ చాలా బాగుంటుంది. సాయి ధరమ్‌ తేజ్‌కు సరిగ్గా సరిపోయే స్టోరీ.

ఈ చిత్రాన్ని మా సన్నిహితుడు కృష్ణ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా అనుకున్నట్టుగా అనుకున్న టైంలో చాలా బాగా వచ్చింది. జవాన్‌ ప్రీలుక్‌ చాలా బాగుంది. అలాగే ఇప్పుడు విడుదల చేసిన మొదటి లుక్‌ కూడా చాలా బాగుంది అన్నారు. దర్శకుడు బివిఎస్‌ రవి మాట్లాడుతూ జవన్‌ చిత్రం మంచి కాన్సెప్ట్‌తో తెరకెక్కుతుంది. దేశానికి జవాన్‌ ఎంత అవసరమో ప్రతి ఇంటికి మా కథానాయకుడి లాంటి వాడు ఉండాలని చెప్పడమే మా ఉద్దేశం. మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఓ యువకుడికి ఎలాంటి కష్టాలు వచ్చాయి. తన కుటుంబాన్ని మనోధైర్యంతో తన బుద్ధిబలంతో ఎలా కాపాడుకున్నాడన్నదే జవాన్‌ ః్‌థ. అందుకే ఇంటికొక్కడు అనే క్యాప్షన్‌ పెట్టాం. ఇది పక్కా ఫ్యామిలీ ఎమోషన్స్‌తోకూడిన ఎంటర్‌టైనింగ్‌ కమర్షియల్‌ చిత్ర. తమన్‌ అద్భుతమైన ట్యూన్స్‌ ఇచ్చాడు. మెహ్రీన్‌ ఈ సినిమాకు స్పెషల్‌ ఎట్రాక్షన్‌ ప్రసన్న మెయిన్‌ విలన్‌గా నటించారు. మా ప్రీలుక్‌ ఎలా ఆకట్టుకుందో, ఈ మొదటిలుక్‌ కూడా ద్నా మించి ఆకట్టుకుంటుంది అన్నారు.

నిర్మాత కృష్ణ మాట్లాడుతూ జవాన్‌ ప్రాజెక్ట్‌ విషయంలో మా ధైర్యం మా దిల్‌రాజు గారు. ఆయన ముందుండి ఈ ప్రొజెక్ట్‌ని స్మూత్‌గా కంప్లీట్‌ చేశారు. దర్శకుడు బివిఎస్‌ రవి చెప్పిన కథ మాస్‌ కమరిశీయల్‌ ఎలిమెంట్స్‌తో సాయిధరమ్‌తేజ్‌కి సరిగ్గా సరిపోయే కథ. ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా గ్రాండియర్‌గా ఈ చిత్రాన్ని నిర్మించార. ఇటీవలే ఇటలీలో అందమైన లొకేషన్స్‌లో రెండు పాటలు షూటింగ్‌ పూర్తిచేసుకున్నాం. కొరియో గ్రాఫర్‌ రఘు మాస్టర్‌ ఓ పాటని, శేఖర్‌ మాస్టర్‌ ఓ పాటని కొరియోగ్రఫి చేశారు. సాంగ్స్‌ చాలా బాగా వచ్చాయి. జూన్‌ 23 నుండి హైదరాబాద్‌లో యాక్షన్‌ పార్ట్‌ చిత్రికరిస్తాము. మిగిలిన షూటింగ్‌ పార్ట్‌ని జూలైలో కంప్లీట్‌ చేసి ఆగస్టులో చిత్రాన్ని విడుదల చేస్తాము. జూన్‌22న దర్శకుడు బివిఎస్‌రవి జన్మదినోత్సవం సందర్భంగా జవాన్‌ చిత్రం మొదటి లుక్‌ని విడుదల చేస్తున్నాము. మా దర్శకుడికి జవాన్‌ చిత్ర యూనిట్‌ తరుపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము అని అన్నారు. నటీనటులు: సాయి ధరమ్‌తేజ్‌, మెహ్రీన్‌, ప్రసన్న, జయప్రకాష్‌, ఈశ్వరీ రావ్‌ తదితరులు. కెమెరా మెన్‌: కెవి గుహన్‌, మ్యూజిక్‌: తమన్‌, ఆర్ట్‌: బ్రహ్మ కడలి, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, సహ రచయితలు: కళ్యాణ్‌ వర్మ దండు, సాయి కృష్ణ, వంశీ బలపనూరి, బ్యానర్‌: అరుణాచల్‌ క్రియేషన్స్‌, సమర్పణ: దిల్‌ రాజు, నిర్మాత: కృష్ణ, స్టోరి, స్క్రిన్‌స్లే, డైలాగ్స్‌, డైరక్షన్‌: బివిఎస్‌ రవి. =========================