‘జవాన్‌’ మూవీ ఫస్ట్‌సాంగ్‌

SAI  DHARAM TEJ-1
SAI DHARAM TEJ

‘జవాన్‌’ మూవీ ఫస్ట్‌సాంగ్‌

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌తేజ్‌, మెహ్రీన్‌ ఫిర్జాదా జంటగా బివిఎస్‌ రవి దర్శకత్వం వహిస్తున్న చిత్రం జవాన్‌.. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పణలో అరుణాచల్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై కృష్ణ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.. ఈచిత్రం ఫస్ట్‌సాంగ్‌ను సాయిధరమ్‌తేజ్‌ బర్త్‌డే కానుకగా రిలీజ్‌ చేశారు.. ఈపాట అంచనాల్ని మించి ఉండటంతో అభిమానులు ఫుల్‌ఖుషీగా ఉన్నారు. ఈపాటకు థమన్‌ ట్రెండీ ట్యూన్‌ అందించారు.. కెకె అందించిన సాహిత్యంలో హీరో క్యారెక్టర్‌ని జవాన్‌ ధీమ్‌ని ఎలివేట్‌ చేసింది.. ఇటీవలే విడుదలైన టీజర్‌తో భారీగా అంచనాలు పెరిగిన సంగతి తెలిసిందే.. ఈ సందర్భంగా దర్శకుడు బివిఎస్‌ రవి మాట్లాడుతూ, దేశానికి జవాన్‌ ఎంత అవసరమో ప్రతి ఇంటికీ మా కథానాయకుడు లాంటి వ్యక్తి ఉండాలని చెప్పటమే మా ఉద్దేశ్యమన్నారు.. మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడి పాత్రలో సాయిధరమ్‌తేజ్‌ కన్పిస్తారన్నారు.. తన కుటుంబాన్ని మనోధైర్యంతో, బుద్ధిబలంఓత ఎలా కాపడుకున్నాడన్నదే జవాన్‌ కథ అన్నారు.. మెహ్రీన్‌ ఈసినిమాకు స్పెషల్‌ ఎట్రాక్షన్‌ అని, ప్రసన్న మెయిన్‌ విలన్‌గా నటించారన్నారు. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయని, త్వరలో ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.