జలం

బాలగేయం
జలం

WATER-
WATER

జలం జలం జలం జలం జలమే కద మనకు బలం బలమే లేకున్నచో మన బతుకున లేదు ఫలం!! అవని పైన నిండు జలం అన్నదాత గుండె బలం ఆహారము నందించగా భుజమున తానెత్తు హలం !! కదలించిన రైతు హలం సిద్ధమగును పంట పొలం సిరులను పండించు రైతు సమృద్ధిగా నున్న జలం !! కరుణించినచో కాలం రైతుకందు కష్ట ఫలం కాదని కసి చూపినచో ప్రవహించును కంటజలం !! విశ్వమునకు తిండిపెట్టు సైనికునికి సలాం గొట్టు మంచి మనసుతోనతనకి సాయమింత చేసిపెట్టు !!

– గుళ్లపల్లి తిరుమల కాంతికృష్ణ, చేర్యాల