జర్మనీకి కొరియా ఝలక్‌

 •  

  MEXICO,SWEEDAN
  MEXICO,SWEEDAN


  జర్మనీకి కొరియా ఝలక్‌

  ఎకటెరిన్‌బర్గ్‌ : డిఫెండింగ్‌ చాంపియన్‌ జర్మనీ ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ నుంచి అవమానకర రీతిలో నిష్క్రమించింది.గ్రూప్‌ ‘ఎఫ్‌లో స్వీడన్‌తో సమానంగా మూడు పాయింట్లతో నిలచిన జర్మనీ చివరి లీగ్‌ మ్యాచ్‌లో పేలవమైన ఆటతీరుతో మ్యాచ్‌ను 2-0 గోల్స్‌తో కొరియా చేతిలో పరాజయం పొందింది.ఇదే గ్రూప్‌లో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో వున్న మెక్సికోను 3-0గోల్స్‌తో స్వీడన్‌ మట్టికరిపించి నాకౌట్‌కు చేరుకుంది.దీంతో జర్మనీ కథ లీగ్‌ దశలోనే ముగిసింది.ఆట ప్రారంభం నుంచి దూకుడు ప్రదర్శించిన స్వీడన్‌ ప్రత్యర్థిపై విరుచుకుపడి గోల్స్‌ సాధించడం విశేషం.ఆట ప్రథమార్థంలో తీవ్రంగా ప్రతిఘటించిన మెక్సికో ద్వితీయార్థంలో చేతులెత్తేంది.

  దీంతో విజృంభించిన స్వీడన్‌ స్ట్రయికర్‌లు 50వ నిమిషంలో ఫలితాన్ని రాబట్టుకున్నారు.అగస్టిన్‌సన్‌ తొలి గోల్‌ చేసి స్వీడన్‌ను 1-0 ఆధిక్యంలో నిలిపాడు.గోల్‌ చేసిన ఉత్సాహంలో అదే ఊపు కొనసాగించిన స్వీడన్‌కు 62వ నిమిషంలో గ్రాన్‌క్విస్ట్‌ పెనాల్టీకార్నర్‌ను గోల్‌గా మలచి 2-0 ఆధిక్యాన్నిచ్చాడు.మెక్సికో డిఫెండర్లు విఫలం చెందడంతో స్వీడన్‌ స్ట్రయికర్లు పదేపదే గోల్‌పోస్టుపై దాడికి దిగడంతో చెల్లాచెదురయ్యారు.ఈనేపథ్యంలో 74వ నిమిషంలో అల్వారెజ్‌ ఓపెన్‌ గోల్‌ సాధించి స్వీడన్‌కు 3-0 గోల్స్‌తో తిరుగులేని ఆధిక్యంలో నిలిపాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన దక్షిణ కొరియా తన చివరి లీగ్‌ మ్యాచ్‌లో జర్మనీని ముప్పుతిప్పలు పెట్టి విజయంతో ప్రపంచకప్‌కు వీడ్కోలు పలికింది.దీంతో గోల్‌చేడానికి ఆపసోపాలు పడి అలసిపోయింది.ఏ దశలోను జర్మనీ స్ట్రయికర్లు ముందుకు సాగేందుకు చెమటోడ్చాల్సి వచ్చింది.

  అడుగడుగునా కొరియా మిడ్‌ఫీల్డ్‌ ప్రతిఘటించడంతో తోకముడిచారు.నిర్ణీత సమయానికి ఇరు జట్లు గోల్స్‌లేమితో నిలిచాయి.అయితే ఇంజురీ సమం 90+2 నిమిషంలో కొరియాకు కిమ్‌యంగ్‌ గోల్‌ చేసి 1-0 ఆధిక్యాన్నిచ్చాడు.మరో నాలుగు నిమిషాల వ్యవధి 90+6లో సన్‌హియుంగ్‌ మిన్‌ రెండో గోల్‌ చేయడంతో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. గెలిచి నిలిచిన అర్జెంటీనా సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ : తప్పని సరిగా గెలవాల్సిన చివరి లీగ్‌మ్యాచ్‌లో అర్జెంటీనాఅద్భుత విజయానందుకుని నాకౌట్‌ ఆశలు సజీవం చేసుకుంది.

  ఇక్కడ మంగళవారం రాత్రి నైజీరియాలో గ్రూప్‌ ‘డిలో జరిగిన మ్యాచ్‌లో 2-1గోల్స్‌తో నెగ్గి ప్రీ క్వార్టర్స్‌కు చేకుంది.తొలి రెండు మ్యాచ్‌ల్లో పేలవమైన ఆటతీరుతో నిరాశ పరచిన స్టార్‌ స్ట్రయికర్‌ మెస్సిఈ మ్యాచ్‌లో మెరుపులా మెరిసి జట్టుకు విజయానికి పునాది వేశాడు.ఆట 14వ నిమిషంలోనే గోల్‌ చేసి 1-0 ఆధిక్యంలో నిలిపాడు.దీంతో పట్టు బింగించిన అర్జెంటీనా ఆధ్యంతం బంతిని తన ఆధీనంలో వుంచుకుంది. ఈనేపథ్యంలో ప్రథమార్థంలో నైజీరియన్ల ఎత్తులు ఏమాత్రం పారలేదు.ద్వితీయార్థంలో దూకుడు ప్రదర్శించి పెనాల్టీ రాబట్టుకున్న నైజీరియాకు విక్టర్‌ మోసెస్‌ గోల్‌ చేసి స్కోరును 1-1గా సమం చేశాడు.దీంతో మ్యాచ్‌ హోరాహోరీని తలపించింది.

  అయితే చావోరేవో తేల్చుకునేందుకు సిద్ధపడ్డ అర్జెంటీనాకు రోజో రూపాంలో అదృష్టం వరించింది. ఆట 86వ నిమిషంలో లభించిన అవకాశాన్ని సద్వినియోగ పరచి గోల్‌గా మలచడంతో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లి ఊపిరి పీల్చుకుంది. ఎదురు లేని క్రొయెసియా రొస్తోవ్‌ : క్రొయెసియా ఆడిన మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించి అజేయంగా నాకౌట్‌కు చేరింది.గ్రూప్‌ ‘డిలో బుధవారం రాత్రి ఐస్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 2-1 గోల్స్‌తో గెలు పొందింది.తొలిసారి ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌లో అడుగుపెట్టిన ఐస్‌లాండ్‌ అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంది.మొదటి మ్యాచ్‌లో అర్జెంటీనాను నిలువరించి మ్యాచ్‌ను డ్రా చేసుకున్న ఐస్‌లాండ్‌ రెండో మ్యాచ్‌లో ఓడినప్పటికీ, చివరి లీగ్‌ మ్యాచ్‌లో క్రొయెసియాకు గట్టిపోటీనిచ్చింది.ప్రథమార్థంలో ప్రత్యర్థిని నిలువరించడంతో 0-0తో సమవుజ్జీగా నిలచింది.

  ద్వితీయార్థం 53వ నిమిషంలో మిలాన్‌ గోల్‌ చేయడంతో క్రొయెసియా 1-0 ఆధిక్యం పొందింది.దీంతో క్రమంగా పుంజుకున్న ఐస్‌లాండ్‌ 76వ నిమిషంలో పెనాల్టీ రాబట్టుకుంది.అందివచ్చిన అవకాశాన్ని సిగురొసన్‌ గోల్‌గా మలచి స్కోరును 1-1గా సమం చేశాడు. మ్యాచ్‌ డ్రాగా ముగియడం ఖాయమనుకున్నంటున సమయంలో ఆఖరి క్షణంలో(90)నిమిషంలో ఇవాన్‌ గోల్‌ చేయడంతో క్రొయెసియా 2-1 గోల్స్‌ ఆధికంలోకి దూసుకెళ్లి విజయాన్నందు కుంది.