జయ మెడిక‌ల్ రిపోర్టులో బ‌య‌ట‌ప‌డ్డ కొత్త విష‌యాలు!

jayalalitha
jayalalitha

చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆమె మరణం ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది.! తాజాగా అపోలో ఆస్పత్రి బృందం విడుదల చేసిన జయలలిత మెడికల్ రిపోర్టులో కొత్త విషయాలు వెలుగు చూశాయి. జయ న్యూమోనియాతో ఆస్పత్రిలో చేరారని, ఐస్‌క్రీమ్స్‌ తినడం ద్వారా షుగర్‌ లెవల్స్‌ పెరిగాయని, ఆస్పత్రిలో చేరినప్పుడు జయ ఒంటిపై ఎక్కడా గాయాలు లేవని రిపోర్టులో పేర్కొన్నారు. ఆస్పత్రిలో చేరిన మర్నాడే స్పృహలోకి వచ్చిన జయ రెండు వారాల పాటు స్పృహలోనే ఉన్నారని, ఆ తర్వాతే ఆమె ఆరోగ్యం విషమించిందని రిపోర్టులో అపోలో వైద్యులు స్పష్టం చేశారు