జయేంద్ర సరస్వతి పరమపదించారు

కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి పరమపదించారు. కంచి పీఠానికి ఆయన 69వ అధిపతి నియమితులయ్యారు. 1935 జులై 18న తంజావూరు జిల్లాలో జన్మించిన జయేంద్ర అసలు పేరు సుబ్రహ్మణ్య అయ్యర్. 1954 మార్చి 24న జయేంద్ర సరస్వతిగా మారారు. శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్న జయేంద్ర నిన్న కాంచీపురంలోని ఎబిసిడి ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు.
కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి మహా సమాధి రేపు ఉదయం 8 గంటలకు జరుగనున్నది. కంచి మఠంలోని చంద్రశేఖరేంద్ర సరస్వతి బృందావనం ప్రక్కనే మహా సమాధికి ఏర్పాట్లు చేస్తున్నారు.
జయేంద్ర సరస్వతీ మహాస్వామివారు పరమపదించడం భారత జాతికి తీరని లోటని విశాఖలోని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి అన్నారు. జయేంద్ర సరస్వతి కొన ఊపిరి వరకూ ధర్మం కోసం పర్యటించడం ఎంతో స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు.