జయలలిత మెమోరియల్‌కు అనుమతి

jayalalitha
jayalalitha

చెన్నై: తమిళనాడు దివంగత సిఎం జయలలిత మెమోరియల్‌ను మెరీనా బీచ్‌లో నిర్మించేందుకు మద్రాస్‌ హైకోర్టు అనుమతించిది. ఆమెస్మారక చిహ్నాన్ని నిర్మించకూడదంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాం(పిల్‌)ను న్యాయస్థానం కొట్టి వేసింది. ఆమె మృతి చెందిన కారణంగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమెను దోషిగా పేర్కొనడానికి వీల్లేదని పేర్కొంది. జస్టిస్‌ ఎం.సత్యనారాయణ, పి.రాజమాణిక్యంతో కూడిన ధర్మాసనం ఇందుకు సంబంధించిన ఆదేశాలను జారీ చేసింది. ప్రజలను దృష్టిలో పెట్టుకుని విధానపరమైన నిర్ణయాలను తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది