జయలలిత చికిత్సకు అయిన ఖర్చు రూ.5.5 కోట్లు

jayalalitha
jayalalitha

జయలలిత చికిత్సకు అయిన ఖర్చు రూ.5.5 కోట్లు

చెన్నై: తమిళనాడు దివంగత సిఎం జయలలిత చికిత్సకు అయిన ఖర్చు రూ.5.5 కోట్లు అయ్యిందని అపోలో వైద్యులు తెలిపారు.. అపోలో వైద్యులతో కలిసి లండన్‌ డాక్టర్‌ రిచర్డ్‌ బీలే వివరణ ఇచ్చారు.. జయలలిత కు అందిన వైద్యంపై వచ్చిన ఆరోపణలలను కొట్టిపారేశారు.. జయలలిత చికిత్స విషయంపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు రాలేదని తెలిపారు. ఆసుపత్రికి వచ్చిన జయకు సీరియస్‌ ఇన్ఫెక్షన్‌ ఉందన్నారు.. ఇన్ఫెక్షన్‌ వల్ల శరీరంలో అవయవాలు దెబ్బతిన్నాయని చెప్పారు. సెప్టెంబర్‌ 22 నుంచి సెప్టెంబర్‌ 29 వరకు వెంటిలేటర్‌పై జయ ఉన్నారని తెలిపారు. జయ పరిస్థితి విషమంగా ఉన్నందునే ఇతరులను లోపలికి అనుమతించలేదన్నారు. జయలలిత ట్రీటీమెంట్‌ అందించిన గదిలో సిసి కెమేరాలు లేవన్నారు.. ట్రీట్‌మెంట్‌ను సిసి కెమేరాల్లో రికార్డుచేయటం సరికాదన్నారు.. పేషెంట్‌ క్రిటికల్‌ కేర్‌లో ఉంటే ఫొటోలు, వీడియోలు ఎలా తీస్తామని తెలిపారు.. జయలలిత కాళ్లు తీసేసినట్టు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదన్నారు.. అధిక రక్తపోటు , షుగర్‌ వల్ల జయ త్వరలగా కోలుకోలేకపోయారని తెలిపారు. చివరి నిముషం వరకు జయ మాట్లాడారని తెలిపారు.. గుండెపోటు రావటంతో అత్యుత్తమ వైద్యుం అందించామని , ఆరోగ్యంపై శశికళ, సిఎస్‌లకు ఎప్పటికపుడు సమాచారం అందించామన్నారు.