జయలలిత కొత్త విగ్రహాం ఆవిష్కరణ

jayalalitha statua
jayalalitha statua

చెన్నై: 2016 డిసెంబర్‌లో జయలలిత మరణించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో జయ కాంస్య విగ్రహాన్ని పార్టీ కార్యాలయ ఆవరణలో పెట్టారు. కాగా ఈ విగ్రహం స‌రిగా లేద‌ని ఆరోప‌ణ‌లు చేశారు. విగ్ర‌హంలోని ముఖ‌క‌వ‌ళిక‌లు జ‌యలలిత‌లా లేవ‌ని నిరుత్సాహాప‌డ్డారు. దీంతో ప‌ళ‌ని ప్ర‌భుత్వం మ‌ళ్లీ కొత్త కాంస్య విగ్ర‌హాన్ని చేయించింది. మెడ‌లో గులాబీ మాల‌తో పాటు రెండు ఆకుల గుర్తు చూపిస్తు నిలుచున్న జ‌య విగ్ర‌హాన్నిఈరోజు  మ‌ళ్లీ సీఎం ప‌ళని ఆవిష్క‌రించారు.