జయమ్ము నిశ్చయమ్మురా ట్రైలర్‌ విడుదల

jayammu nisjayambu ra15
jayammu nisjayambu ra

జయమ్ము నిశ్చయమ్మురా ట్రైలర్‌ విడుదల!

శ్రీనివాస్‌ రెడ్డి, పూర్ణ జంటగా నటిస్తోన్న చిత్రం జయమ్ము నిశ్చయమ్మురా. ఈ చిత్రాన్ని సతీష్‌ కనుమూరితో కలిసి.. శివరాజ్‌ ఫిలిమ్స్‌ పతాకంపై శివరాజ్‌ కనుమూరి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ ను దర్శకుడు కొరటాల శివ ఆదివారం హైదరాబాద్‌ లో విడుదల చేశారు. ఈ సందర్భంగా.. కొరటాల శివ మాట్లాడుతూ.. ఇటీవలకాలంలో ఇంత మంచి సినిమా చూడలేదని నా ఫీలింగ్‌. ఈ సినిమా చూశాక.. మన చుట్టూరూ ఉండే మనుషుల్లోంచి ఎన్ని పాత్రలు సృష్టించొచ్చొ నాకు అర్ధమయ్యింది. రవిచంద్ర సమకూర్చిన సంగీతం ఈ సినిమాకు గల ప్రధాన ఆకర్షణలో ఒకటని చెప్పొచ్చు అన్నారు. వక్కంతం వంశీ మాట్లాడుతూ.. ఖిసహజత్వానికి దూరంగా ఉండే సన్నివేశాలు, పాటలు, ఫైట్స్‌ చూసి చూసి విసిగిపోయి ఉన్న తెలుగు ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతిని పంచే చిత్రమిది అన్నారు. అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ.. ఈ సినిమాలో హీరోగా నటించిన నా మిత్రుడు శ్రీనివాస్‌ రెడ్డిని చూసి చాలా గర్వ పడుతున్నాను. శివరాజ్‌ కనుమూరి సినిమాను అద్భుతంగా తెరకెక్కించారుఖి అన్నారు. చిత్ర కథానాయకుడు శ్రీనివాస్‌ రెడ్డి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో ఈ చిత్రంలో నటించిన కష్ణ భగవాన్‌, రవివర్మ, కష్ణుడు, జోగి బ్రదర్స్‌, చిత్ర సమర్పకులు ఏ.వి.ఎస్‌.రాజు, నిర్మాతల్లో ఒకరైన సతీష్‌ కనుమూరి తదిరులు పాల్గొన్నారు. ఈ వారంలో ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా ఆడియో విడుదల జరుపుకోనున్న ఈ చిత్రం ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.