జమ్మూలో ఉగ్రవాది అరెస్టు

శ్రీనగర్‌: లష్కరే తోయిబా ఉగ్రవాదిని అరెస్టు చేసినట్లు జమ్మూకాశ్మీర్‌ పోలీసులు శనివారం తెలిపారు. ఉగ్రవాది గత ఏడాది కాశ్మీర్‌లో ముగ్గురు బిజెపి కార్యకర్తలు, ఓ పోలీస్‌ అధికారి హత్య కేసులో నిందితుడు. జమ్మూలోని సాంబా నుంచి ఉగ్రవాద సంస్థ ఎల్‌ఈటీ (టీఆర్‌ఎఫ్) కు చెందిన జహూర్ అహ్మద్ రాథర్, అలియాస్ ఖలీద్ అలియాస్ సాహిల్‌ను అనంతనాగ్ పోలీసుల బృందం అరెస్టు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (కాశ్మీర్) విజయ్ కుమార్ పేర్కొన్నారు. బారి బ్రాహ్మణ్‌లో దాచుకోగా.. అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. 2024లో పీఓకేలో ఉగ్రవాద శిక్షణ తీసుకున్నాడని, అతనితో పాటు ఐదుగురు విదేశీ ఉగ్రవాదులను దేశంలోకి తీసుకువచ్చాడన్నారు. 2006 లొంగిపోయాడని.. కానీ గత సంవత్సరం మళ్లీ రాజకీయ నాయకులు, పోలీసులను హత్య చేయడం ప్రారంభించాడన్నారు. అతన్ని విచారణ కోసం కాశ్మీర్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు.