జమ్ము ప్రాంతంలో 1103 నామినేషన్లు

EVM
EVM

జమ్ము: జమ్ముకాశ్మీర్‌లో పట్టణ ప్రాంత స్థానిక సంస్థల ఎన్నికల మొదటిదశలో మొత్తం 1103 మంది అభ్యర్ధుల నామినేషన్లను అధికారులు అనుమతించారు. జమ్ముప్రాంతంలోనే అత్యధికంగా నామినేషన్లు దాఖలయ్యాయి. 11 నామినేషన్లు చెల్లనవిగా తొలగించారు. మొత్తం నామినేషన్లప్రకారంచూస్తే 476 మంది అభ్యర్ధులు జమ్ము మున్సిపల్‌కార్పొరేషన్‌ ఎన్నికల్లో చెల్లుబాటవుతాయని ప్రకటించారు. వీటిలో 335 మంది పురుషులు, 141 మంది మహిళా అభ్యర్ధులున్నారు. తర్వాత అధికారులు సైతం 155 మంది అభ్యర్ధులు జాతీయ పార్టీలనుంచి నామినేషన్లు దాఖలుచేస్తే 21 మంది రాష్ట్ర పార్టీలనుంచి 400 మందికిపైగా స్వతంత్ర అభ్యర్ధులున్నారు.జమ్ముజిల్లాలోని ఏడు మున్సిపల్‌ కమిటీలకు సంబంధించి 327 మంది అభ్యర్ధులు నిలిచారు. వీరిలో 238 మంది పురుషులు, 89 మంది మహిళలు ఉన్నారు. మొదటి దశ ఎన్నికలకు ఈ నామినేషన్లను ఎన్నికల అధికారులు ధృవీకరించినట్లు వెల్లడించారు. మిగిలిన మున్సిపాలిటీల్లో కూడా చెల్లుబాటవుతున్నట్లు ప్రకటించారు. జమ్ము ప్రాంతంలోని ఇతర జిల్లాల్లోసైతం నామినేషన్లను అధికారులు అనుమతించారు. ఎన్నికల నోటిఫికేషన్‌ప్రకారం నామినేషన్ల దాఖలుకు ఈనెల 25వ తేదీ తుదిగడువు. పరిశీలనకు ఈనెల 26వ తేదీ కాగా ఉపసంహరణకు 28వ తేదీ చివరితేదీగా ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియలో పోలింగ్‌ వచ్చేనెల ఎనిమిదవ తేదీ ఉదయం ఏడు నుంచిమధ్యాహ్నం రెండు గంటలవరకూ కొనసాగుతుంది. ఓట్ల లెక్కింపు వచ్చేనెల 20వ తేదీ ఉంటుందని ప్రకటించింది. ఎన్నికలుఅన్ని దశల్లోను మొత్తం వచ్చేనెల 27వ తేదీకల్లా పూర్తి అవుతాయి.