జమ్ము పనితీరును ఆడిట్‌ చేయాలి

 

CJSF

జమ్ము:జమ్ము ప్రభుత్వ తీరును ఆడిట్‌ చేయాల్సిన తరుణం ఆసన్నమైందని సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ టిఎస్‌ ఠాకూర్‌అన్నారు. ఆదివారం ఇక్కడ రెండు రోజుల లీగల్‌ సెమినార్‌ను ఆయన ప్రారంభించారు. చట్టాల అమలు, హైకోర్టు జడ్జీల నియామకాల్లో జాప్యంపై ఆయన ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ప్రజలహక్కుల కోసం మీరు తయారు చేసిన చట్టాల మేరకే కోర్టులు పనిచేస్తాయని కానీ, వ్యక్తిగత గొప్పలకోసం కాదని అన్నారు. అసంఖ్యాకంగా ప్రజలు న్యాయం కోసం ఎదురుచూస్తుంటే జడ్జిల నియామకాలకు సంబంధించి కేవలం ప్రతిపాదనలు చేస్తూ కూర్చోజాలదని అయన పేర్కొన్నారు.