జమ్ముకశ్మీర్‌ సిఎం ముఫ్తీమహ్మద్‌ మృతి

 

CM
ఢిల్లీ: జమ్ము కశ్మీర్‌ ముఖ్యమంత్రి ముఫ్తీమహ్మద్‌ సయీద్‌(79) మృతిచెందారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం ఉదయం కన్నుమూశారు.
రాజకీయంగా అంచెలంచెలుగా ఎదిగిన ముఫ్తీ:
జమ్ము కశ్మీర్‌ సిఎం ముఫ్తీ మహ్మద్‌ 1936 జనవరి 12న జమ్మూకశ్మీర్‌లోని బిజ్‌హెహరాలో జన్మించారు. రాజకీయంతో అంచెలంచెలుగా ఆయన ఎదిగారు. కాశ్మీర్‌ ప్రజల హక్కుల సాధనలకు ఉద్యమించే నేతగా ఆయనకు మంచి పేరుంది. 1989-90 మధ్య కాలంలో కేంద్ర హోంమంత్రిగా వ్యవహరించిన ఆయన 1990లో పీపులు డెమోక్రటిక్‌ పార్టీని స్థాపించారు. 2002-2005 మధ్య తొలిసారి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. తిరిగి 2015 మార్చి 1న భారతీయ జనపా పార్టీ (బిజెపి) సహకారంతో తిరిగి రెండోసారి సిఎం గా ప్రమాణ స్వీకారం చేశారు. కొద్దిరోజుగా అనారోగ్యంతో బాధపడుతూ ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఇవాళ ఉదయం కన్నుమూశారు.