జపాన్‌ ఓపెన్‌ నుంచి సింధు ఔట్‌

P V Sindhu
P V Sindhu

టోక్యో: జపాన్‌ ఓపెన్‌ నుంచి తెలుగు తేజం, ఒలంపిక్‌ పతక విజేత పీవీ సింధు వెనుదిరిగింది. నాలుగో సీడ్‌గా బరిలోకి దిగిన సింధు
ప్రీక్వార్టర్స్‌లో జపాన్‌ క్రీడాకారిణి నొజొమి ఒకుహరతో తలపడింది. సింధు రెండు వరుస సెట్లలో 18-21,8-21తో మ్యాచ్‌ను కొల్పొయింది.
ఇటీవల కొరియా ఓపెన్‌ ఫైనల్లో ఒకుహరపై విజయం సాధించిన సింధు ఈ సారి మాత్రం తన ఆధిక్యాన్ని ప్రదర్శించలేక పోయింది.