జన సమర్ధం ఉన్న ప్రాంతాల్లో క్యూ పాటించాలి

malls
malls

సినిమా థియేటర్లు, బస్‌ స్టాండ్లు, షాపింగ్‌ మాల్స్‌ తదితర ప్రాంతాలలో క్యూ పాటించాలి
హైదరాబాద్‌: ప్రజలు ఎక్కువగా వచ్చే అవకాశాలున్న సినిమా థియేటర్లు, షాపింగ్‌ మాల్స్‌, బస్‌ స్టాండ్లు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, మతపరమైన ప్రాంతాలు, విద్యా సంస్థలు, ఎగ్జిబిషన్లు, ఫుడ్‌ అవుట్‌ లేట్లు, మద్యం దుకాణాలు, ఎటిఎంలు తదితర ప్రాంతాలలో నిర్వాహకులు క్యూ పద్దతి అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని నగర పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రాంతాలలో క్యూ పద్దతి అమలు చేయక పోవడం వల్ల చాలాసార్లు తొక్కిసలాట జరిగి సమస్యలు తలెత్తుతున్నాయని, దీనివల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నాయని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు క్యూ పద్దతి పాటించేలా నిర్వాహకులు తగిన చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో విఫలమైతే కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు.
ధర్నాలు, ర్యాలీలపై నిషేధం
ఇదిలావుండగా జంట నగరాలలో ర్యాలీలు, ధర్నాలపై నిషేధం విధిస్తూ పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. శాంతి భద్రతల పరి స్థితుల నేపథ్యంలో ఈ నిషేధాజ్ఞలు విధిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ నిషేధాజ్ఞలు వెంటనే అమల్లో వస్తుందని, ఫిబ్రవరి 12వ తేదీ వరకు అమల్లో వుంటుం దని ఆయన తెలిపారు. డ్యూటీలో వున్న పోలీసులు, మిలటరీ సిబ్బంది, హోంగార్డులు, బ్యాంకులు, ఎటిఎంల వద్ద కాపలాగా వున్న సాయుధులకు ఇవి వర్తి ంచవు. నిషేదాజ్ఞల నేపథ్యంలో ర్యాలీలు, ధర్నాలు, సమావేశాలు నిర్వహించే సంస్థలు ముందుగా సంబంధిత డిసిపిల నుంచి అనుమతి తీసుకోవాలని ఆయన కోరారు. ఈ ఆ దేశాలను ఖాతరు చేయని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
సామాజిక మాధ్యమాల దుష్ప్రచారం చేసే వారిపై చర్యలు
జంట నగరాలలో చిన్న పిల్లలను ఎత్తుకెళ్లే ముఠాలు సంచరిస్తున్నట్లు, పసివారిని హత్యచేసే హంతకులు తిరుగుతున్నట్లు సామా జిక మాధ్యమాల్లో వస్తున్న పుకార్లను ప్రజలు నమ్మవద్దని పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌ కోరారు. వాట్సాప్‌, ట్విటర్‌, ఫేస్‌ బుక్‌లను వాడుతూ కొందరు ఈ తరహా ప్రచారం చేస్తున్నారని, వీటిని ఎవరూ నమ్మవద్దని ఆయన కోరారు. ఈ తరహా ప్రచారం చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు,