జన్‌ధన్‌తో ‘ధనాధన్‌

RUPEES
RUPEES

జన్‌ధన్‌తో ‘ధనాధన్‌

న్యూఢిల్లీ: దేశంలో ప్రతి ఒక్కరికి మొబైల్‌ ఉన్నట్లుగానే అందరికీ బ్యాంకింగ్‌ కార్యకలాపాలు చేరువచేయాలన్న లక్ష్యంతో ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన జన్‌ధన్‌ ఖాతా లను ప్రారంభించి ఆర్థిక చేకూర్పుకు జెడివై ఎంతో మేలుచేస్తుందని అందరిలోనే భావన రేకెత్తించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ ఐదో తేదీనాటికి 28.23 కోట్ల ఖాతాలు ప్రారంభించారు. ఆర్థిక మంత్రిత్వశాఖ తన ట్విట్టర్‌ఖాతాలో ఈఅంశాన్ని వెల్లడించింది. బ్యాంకు శాఖలకు వెళ్లడం, లేదా బిజినెస్‌ కరస్పాండెంట్లను ఆశ్రయించడం ద్వారా ఈ ఖాతాలు ప్రారంభించ వచ్చు. అలాగే బ్యాంకు మిత్రాలు కూడా సహకరి స్తారు. జన్‌ధన్‌పరంగాచూస్తే ఇప్పటివరకూ 63,971 కోట్ల డిపాజిట్లు అందాయి. 22.14 కోట్ల రూపేకార్డులు జారీచేసినట్లు ఆర్థికశాఖ వెల్లడించిం ది. ఇప్పటివరకూ 27.41లక్షల ఖాతాలు ఓవర్‌ డ్రాప్టుసౌకర్యంవినియోగించుకున్నట్లు వెల్లడించారు. ప్రధానంగా ఈ ఖాతాలు వాస్తవానికి ఆర్థికసేవలు, బ్యాంకింగ్‌లో పొదుపు, డిపాజిట్లు, జమలు, రుణా లు, బీమా, పెన్షన్‌ సేవలు అందుబాటులో ఉంటా యి. జన్‌ధన్‌ఖాతాలు ఎలాంటి సొమ్ములులేకుండా ప్రారంభం చేసుకోవచ్చు. చెక్‌బుక్‌ సౌకర్యం కోసం అయితే కనీస నిల్వలు అనివార్యం అవుతాయి. రిజర్వుబ్యాంకు మార్గదర్శకాలను అనుసరించి బేసిక్‌ సేవింగ్స్‌ బ్యాంకు డిపాజిట్‌ ఖాతా (బిఎస్‌బిడిఎ) వంటివి డిపాజిట్‌, విత్‌డ్రాలకోసం వినియోగించు కోవచ్చు. ఎటిఎంలలో డిపాజిట్లు చేసుకోవచ్చు.

జన్‌ధన్‌ ఖాతాలకింద కస్టమర్లు డిపా జిట్లపై వడ్డీ, ప్రమాదబీమా లక్ష రూపా యల వరకూ ఉంటుంది. జీవితబీమా 30 వేల వరకూ కవర్‌ అవుతుంది. అలాగే పింఛను, బీమా ఉత్పత్తులకు కూడా అనుసంధానం అవుతా రు. సేవింగ్స్‌ బ్యాంకు ఖాతాల వడ్డీరేటు అంటే నాలుగుశాతం అమలవుతుంది. జన్‌ధన్‌ ఖాతాకు నేరుగా లబ్ధిబదిలీ పథకానికి కూడా వినియోగిం చుకోవచ్చు. దీనితో ప్రభుత్వం సబ్సిడీలను నేరుగా వారి ఖాతాలకే జమచేసుకునే సౌకర్యం కల్పిస్తుంది. ఆరునెలలకాలం ముగిసిన తర్వాత ఓవర్‌డ్రాప్టు సౌక ర్యం లభిస్తుంది. రూ.5వేలు రూపాయలు ప్రభు త్వం ఒక్కొక్కకుటుంబంలో ఒకరికి కల్పిస్తుంది. రూపే డెబిట్‌కార్డు ఖాతాదారులకు అన్ని ఎటిఎం విత్‌డ్రాల్లో ఉపయోగపడుతుంది. అన్ని పాయింట్‌ ఆఫ్‌సేల్‌ లావాదేవీలకుసైతం వినియోగించుకునే అవకాశం ఉంటుంది. 2018 ఆగస్టు 14వ తేదీ నాటికి ప్రభ్తువం సమగ్ర ఆర్థికచేకూర్పు లక్ష్యాలను చేరునేందుకు నిర్ణయించింది. ఇందుకు రెండు దశలుగా అమలుచేయాలన్నది నిర్ణయంగా ఉంది.