జన్మతహా సిద్ధించే అమెరికా పౌరసత్వం రద్దు

TRUMP
TRUMP

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌ ఏకపక్షం నిర్ణయం
వాషింగ్టన్‌: అమెరికాలో నివసిస్తున్న వలసవాదుల కుటుంబాల్లోజన్మించిన పిల్లలు, అక్రమ వలసదారుల పిల్లలకు అమెరికా పౌరసత్వ హక్కును డొనాల్డ్‌ ట్రంప్‌ రద్దుచేయాలని నిర్ణయించారు. గడచిన కొన్నేళ్లుగా అమెరికాలో నివసిస్తున్న వలసకుటుంబాల్లోజన్మించిన వారికి జన్మతహా పౌరసత్వ హక్కు కల్పించేటట్లు అక్కడి రాజ్యాంగంలోనే పొందుపరిచారు. తాజాగా ట్రంప్‌ తీసుకున్న రద్దునిర్ణయంతో అమెరికాలో వలసవాదులు, అక్రమవలసవాదులకుటుంబాల్లో జన్మించిన పిల్లలకు ఇకపై పౌరసత్వం లభించే అవకాశాలులేవు. ట్రంప్‌ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారంటూ ఈ నిర్ణయంపై కోర్టులకు వెళ్లే అవకాశం లేకపోలేదని రాజ్యాంగ నిపుణులు చెపుతున్నారు. రాజ్యాంగాన్ని ఏకపక్షంగా సవరించాలన్న ట్రంప్‌నిర్ణయంపై కోర్టుకువెళ్లే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నట్లు అక్కడి మేధావులు నిపుణులు చెపుతున్నారు. అమెరికాపౌరులుకాని కుటుంబాల్లో జన్మించిన పసికందులకు రాజ్యాంగపరంగా సంక్రమించే పౌరసత్వ హక్కునుట్రంప్‌ హరించివేస్తున్నారు. ఇకపై ఈ విధానాన్ని ఎత్తివేయాలనినిర్ణయించినట్లు హెచ్‌బిఒకు చేసిన వ్యాఖ్యల్లోనేతేలింది. అమెరికాలో మధ్యంతర ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో వలస విధానాలపై కఠినతర నిబందనలను అమలుచేయాలని ట్రంప్‌ నిర్ణయించారు. ఆయన మద్దతుదారులను మరింతగా ప్రత్సోహిస్తూ రిపబ్లికన్‌లను కాంగ్రెస్‌ప్రతినిదుల సభలో కట్టడిచేసే లక్ష్యంతోనే ఈ వ్యూహాన్ని అనుసరించినట్లు తెలుపుతున్నారు. అమెరికా మెక్సికో సరిహద్దుల వెంబడి వచ్చే అక్రమ వలసదారుల కుటుంబాల్లో జన్మించిన పిల్లలపై కూడా ట్రంప్‌ ఇటీవలే ఉక్కుపాదంమోపారు. వారికి ఉన్న వీసా అవకాశాలను రద్దుచేసారు. అయితే ఆశ్రయం పొందేవారికి కొంత శిబిరాలు ఏర్పాటుచేస్తామని, ఇందుకు అదనపు బలగాలను పంపిస్తామని చెప్పారు. ఇపుడు ఇతర దేశస్తులు అమెరికాలో నివసిస్తూ వారికి పుట్టిన పిల్లలకుసైతం పౌరసత్వం రద్దుచేయడంపై కోర్టు వ్యాజ్యాలకు ఎక్కువ ఆస్కారం కలిగిస్తున్నట్లు తేలింది. రాజ్యాంగంలోని 14వ సవరణఅమెరికాలో జన్మించిన అందరికీ పౌరసత్వ హక్కును కల్పిస్తోంది. ఇక ఈ విధానానికి స్వస్తిపలకాలని ట్రంప్‌ ఒక కార్యనిర్వాహక ఉత్తర్వును జారీచేయనున్నారు. అదే విషయాన్ని ట్రంప్‌ సైతం స్పష్టంచేసారు. ప్రస్తుతం శ్వేతసౌధం న్యాయవాదులు తన ప్రతిపాదనను సమీక్షచేస్తున్నారని, ఎంత సత్వరమే ఈ ఎగ్జిక్యూటివ్‌ ఉత్తర్వులు వెలువడతాయన్నది ఇపుడే స్పష్టంచేయలేనని అమెరికా అధ్యక్షుడు వెల్లడించారు. ట్రంప్‌ చేపట్టిన ఈ ఉత్తర్వుల వల్ల ఎక్కువగా అమెరికాలోనివసించే భారతీయ కుటుంబాలకే నష్టం కలుగుతోంది. ఇప్పటికే వీసా నిబందనలను కఠినతరంచేసినట్రంప్‌ వర్క్‌ వీసాలను కుదించారు. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అలాగేగల్ఫ్‌దేశాలనుంచి అమెరికాకు వచ్చేవారి వీసాలను సైతం సమగ్ర తనిఖీలతర్వాతే అనుమతించారు. కొన్ని దేశాలపై ఏకపక్షంగా నిషేధం ప్రకటించారు. అదేమంటే ఉగ్రవాదం కట్టడికే ఈచర్యలు తీసుకున్నట్లుస్పస్టంచేసారు. అమెరికా ఫస్ట్‌ నినాదంతో ముందుకువెళుతున్న ట్రంప్‌ ఇందుకు అనుగుణంగా ఇతర దేశాలనుంచి వచ్చి నివసించే వలసవాదులపైనే ఎక్కువ ఆంక్షలుప్రకటిస్తున్నారు. తాజాగా ప్రకటించిన జన్మస్థ శిశువుల పౌరసత్వరద్దుకూడా కోర్టులకు వెళ్లే అవకాశం లేకపోలేదు.