జనాలకు ప్రాణం కంటే మందే ముఖ్యమా?

goutam gambhir
goutham gambhir

న్యూఢిల్లీ: దేశంలో నిన్నటి నుండి మద్యం దుకాణాలు తెరుచుకున్న విషయం తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలో మద్యం ప్రియులు వైన్‌ షాపులు తెరవగానే మాస్కులు లేకుండా, సామాజిక దూరం పాటించకుండా, ఓకరినొకరు తోసుకుంటూ మద్యం షాపుల మందు ఎగబడ్డారు. పలు చోట్ల మద్యం ప్రియుల ఆగడాలు తట్టుకోలేక పోలీసులు మద్యం దుకాణాలను మూసివేయించాల్సి వచ్చింది. ఈ వ్యవహరంపై భారత మాజి ఓపెనర్‌, బిజెపి ఎంపి గౌతమ్‌ గంభీర్‌ మందుబాబులపై మండిపడ్డారు. ఢిల్లీ జనాలకు ప్రాణాలకంటే మందే ముఖ్యమా? అన్ని ప్రశ్నిస్తూ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌లో మందు షాపుల మందు జనాలు ఎగబడుతున్న ఫోటోలను జత చేశారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/