జనసేన సిసిపిఏ ఛైర్మన్‌గా పులిశేఖర్‌

pawan, puli shekhar
pawan, puli shekhar

హైదరాబాద్‌: ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో జనసేన పార్టీ అధినేత పవన్‌ సిసిపిఏ ఛైర్మన్‌గా పులిశేఖర్‌ను నియమించారు. పార్టీలోని కమిటీల నియామకంలో భాగంగా సెంట్రల్‌ కమిటీ ఫర్‌ అఫైర్స్‌(సిసిపిఏ) ఛైర్మన్‌గా స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబం నుంచి వచ్చిన పులిశేఖర్‌ను నియమించారు. పవన్‌ మాట్లాడుతూ..ప్రవాసాంధ్రుడైన పులి శేఖర్‌ అమెరికాలోని తన వ్యాపారాన్ని వదులుకుని పార్టీ కోసం పనిచేసేందుకు నిబద్ధతతో వచ్చారని ప్రశంసించారు.
పులి శేఖర్‌ మాట్లాడుతూ..సిద్ధాంత బలంతో నిర్మితమైన పార్టీ జనసేన అని, పవన్‌ ఆలోచన విధానం, ఆయన భావజాలం తననెంతో ఆకర్షించాయని అన్నారు. తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని అన్నారు.