జనసేన పార్టీ కార్యాలయం మంగళగిరిలో

Janasena
Janasena

మంగళగిరి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ జనసేన రాష్ట్ర పార్టీ కార్యాలయం కోసం ఎన్నారై జంక్షన్‌ వద్ద కొద్ది నెలల క్రితం ఎకరం స్థలాన్ని కొనుగోలు చేశారు. ఈ స్థలంలోనే పార్టీ రాష్ట్ర కార్యాలయ భవనాన్ని శరవేగంగా నిర్మిస్తున్నారు. ఈ కార్యాలయ ప్రాంగణంలోనే గణతంత్ర దిన వేడుకలను ఈ నెల 26న నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం 80 అడుగుల ఎత్తులో జెండా దిమ్మెను పక్కా కాంక్రీటుతో నిర్మిస్తున్నారు. ఈ నెల 26న జరిగే గణతంత్ర దిన వేడుకల్లో పవన్‌ కల్యాణ్‌ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని జనసేన పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.