జనసేన కార్యకర్తలపై షర్మిళ ఫిర్యాదు

sharmila
sharmila

హైదరాబాద్‌: సోషల్‌ మీడియాలో తనపై అభ్యంతరకరమైన దుష్ప్రాచారాలను చేస్తున్నారని హైదరాబాద్‌ సిపి అంజనీకుమార్‌కు ఏపి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సోదరి షర్మిళ దంపతులు ఫిర్యాదు చేశారు. తమపైనా , తమ కుటుంబ సభ్యులపైనా అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్న పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు, జనసేన కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన సిపి ఫిర్యాదుపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.