జనసేనా భారీ ర్యాలీ

Pavan kalyan
Pavan kalyan

తెనాలి: తాను పదవుల కోసం రాలేదని.. దోపిడీకి వ్యతిరేకంగా వచ్చానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ‘పోరాటానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమేనా’ అంటూ కార్యకర్తలనుద్దేశించి ప్రశ్నించారు. నందివెలుగు అడ్డరోడ్డు నుంచి భారీ ర్యాలీ నిర్వహించిన జనసేనాని.. పెదరావూరు బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘2019 మన భావజాలానికి పరీక్షా సమయం. ఆలోచించుకోండి. ఒక్క అడుగు వేశాను. పది అడుగులు తోడయ్యాయి. ఇంకో అడుగువేద్దాం. సోషల్ మీడియాలో కనిపించకుండా తిట్టుకోవడం కాదు. వాట్సాప్‌లలో మాట్లాడటం కాదు. బయటకు వచ్చి మాట్లాడు. అప్పుడు తెలుస్తుంది. భోగిమంటల సాక్షిగా పిరికితనాన్ని కాల్చేద్దాం. అవినీతిని దహించేద్దాం. సరికొత్త వ్యవస్థను తీసుకురావడానికి ప్రయత్నిద్దాం’’ అంటూ ఉద్వేగంగా ప్రసంగించారు.