‘జనసేన’లోకి మెగాస్టార్‌?

Chiru with pawan
Chiru with pawan

‘జనసేన’లోకి మెగాస్టార్‌?

కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పనున్న చిరంజీవి
అన్నయ్యే సర్వం అంటున్న జనసేననేత

అమరావతి : సినీ పరిశ్రమలో తిరుగులేని మెగాస్టార్‌,పీఆర్పి మాజీ అధినేత,కేంద్ర మాజీమంత్రి కె.చిరంజీవి తన తమ్ముడు పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ స్థాపించిన జనసేన పార్టీలో ప్రముఖ పాత్ర వహించడానికి రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది.గతంలో ప్రజారాజ్యంపార్టీ స్థాపించి ఎన్నికల ప్రభం జనంలో కేవలం 18ఎమ్మెల్యే స్థానాలకే పరిమితమై అనతికాలంలోనే ఆ పార్టీ కాంగ్రెస ్‌లోనికి విలీనమై అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి రాకుండా అడ్డుకొని చిరంజీవి సైతం అనతికాలంలోనే కనుమరుగయ్యారు.ఈ నేపధ్యంలో పవన్‌కల్యాణ్‌ తన అన్న తరహాలో పార్టీని స్థాపించకుండా గత ఐదేళ్ళగా ఆచీ తూచీ అడుగులువేసి జనసేన పార్టీ ప్రభంజనం ఇప్పుడిప్పుడే మొదలైంది.

ఇటీవలె చలోరే చలోరోయి.చలో కార్యక్రమం పేరిట మొదటి విడత నాలుగురోజులపాటు తూర్పు,పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా,గుంటూరు,ప్రకాశం జిల్లాల్లో పర్యటనలు చేసిన ప్రతి కార్యక్ర మంలో పవర్‌స్టార్‌ చిరంజీవిని నింగిలోనికి ఎత్తి ప్రజారాజ్యం పార్టీ స్థాపితంలో కొం తమంది నమ్మకద్రోహులు తన అన్నను అన్నివిధాల దెబ్బతీశారని ధ్వజమెత్తుతూ ఆవేశభరితంగా ఆక్రోషంతో ప్రసంగాలు చేశారు.సరైన సమయంలో తన అన్నకు ద్రోహం చేసినవారికి గుణపాఠం చెబుతానని హెచ్చరించారు.తన అన్న ప్రజాసేవ చేయాలని ఎంతో ఉన్నతాశయాలతో స్థాపించిన పార్టీని కాంగ్రెస్‌పార్టీలోనికి విలీనం చేసి రాజకీయంగా నట్టేట ముంచేశారని ఆరోపించారు.అయితే పవన్‌కల్యాణ్‌ పర్యటనలో తన ప్రసంగాలలోనే తన అన్న రాజకీయంగా పున:ప్రవేశం చేస్తారనే విధంగానే సాంకేతికాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కారగ్రెస్‌పార్టీలోనికి విలీనం చేయడం కాంగ్రెస్‌ పాలనలో కేంద్ర మంత్రి పదవి దక్కించుకోవడం ఆయనకు ఇచ్చిన రాజ్యసభ కాలపరిమితి కూడా ముగిసిపోయింది. చాలాకాలంగా ఆయన కాంగ్రెస్‌ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.

జనసేన పార్టీతో ఆయన అనుచరగణం పవన్‌కల్యాణ్‌కు అండగా నిలబడాలని కూడా సూచనలు ఇస్తున్నట్లు తెలుస్తోంది.ఇకపోతే ప్రజారాజ్యం పార్టీ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థుల ఎన్నికల ప్రచారానికి తాను వెళ్ళిన చిరంజీవి బావ అల్లు అరవింద్‌ అన్న తనయుడు రామ్‌చరణ్‌లు తనను ఒక నటునిగానే చూశారేతప్ప తనయొక్క భావాలను అర్ధం చేసుకోలేదని అల్లు అరవింద్‌ పీఆర్పీని కాంగ్రెస్‌ పార్టీలోనికి విలీనంచేసి తప్పిదనం చేశారని చురకలం టించారు.తన అన్నంటే ఎంతో అభిమానమని పదే పదే ఇటీవలే జరిగిన పర్యటనలో తెగపొగిడారు.దీన్నిబట్టి చూస్తే గతంలో పిఆర్పీపార్టీలో జరిగిన తప్పిదాలు జనసేనలో జరగకుండా పొత్తు విషయంలో బిజేపి,తెదేపాలకు అంటినట్లుగా వ్యవహరిస్తూ వైసీపీ ప్రస్థానం లేకుండానే బరిలోనికి దిగి కమ్యూనిస్టులతో జతకట్టి ఇటు మెగాస్టార్‌ ఫ్యాన్స్‌,అటు పవర్‌స్టార్‌ ఫ్యాన్స్‌ లతోపాటు తన సామాజిక వర్గ ఓటర్లులను కలుపుకునే దిశగా చిరంజీవిని పవన్‌కల్యాణ్‌ తెరపైకి తెస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి షూటింగ్‌లో బిజిగా ఉన్న చిరంజీవితో సంప్రదింపులు చేయడంతోపాటు ఇటీవలె సినిమా షూటింగ్‌ను ముగించుకున్న అజ్ఞాతవాసి ఆడియో విడుదల లో ఈనెల19న తనఅన్నచేతుల మీదుగానే విడుదల చేయనున్నారు. మొత్తం మీద పవర్‌స్టార్‌ ఐదేళ్ళుగా రాష్ట్ర రాజకీయాలపై ఆచీ తూచీ అధ్యా యనం చేసి చివరికివారం రోజుల క్రితం పవర్‌స్టార్‌ తొలి విడత పర్యటన చేసి అన్ని పార్టీల నేతల్లో కొరగాని కొరివిగా తయారై ప్రజాప్రతి నిధులకు నిద్ర లేకుండా చేస్తున్నారు.ఇకతన అన్నను తనపార్టీ ద్వారా పూర్తిస్థాయి బాధ్య తలు అప్ప గించి 2019ఎన్నికలను ధ్యేయంగా పెట్టుకొని పవర్‌స్టార్‌ రాజకీయ ఎత్తుగ డలువేస్తూ ప్రత్యర్ధులఎత్తులను అడ్డుకునే దిశగా యోచిస్తున్నట్లు తెలుస్తోంది.