జనవాసాల్లో చిరుత..

Leopard
Leopard

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లో ఇండోర్‌లో ఓ చిరుతపులి జనావాసాల్లోకి దూసుకొచ్చింది. వీధుల్లో తిరుగుతూ స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. మొదట పల్హార్‌ నగర్‌ ప్రాంతంలోని హౌసింగ్‌ కాలనీలోకి ప్రవేశించిన చిరుత నిర్మాణంలో ఉన్న భవనంలోకి దూరింది. తర్వాత మరో ఇంట్లో నక్కి దాదాపు మూడు గంటల పాటు అక్కడే ఉంది. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది అక్కడికి చేరుకుని చిరుతను పట్టుకున్నారు. కాగా, అటవీ సిబ్బంది కట్టిన వలను ఛేదించుకుని వెలుపలికి రావడంతో ముగ్గురు సిబ్బంది గాయపడ్డారు. చిరుతకు మత్తు ఇచ్చేందుకు అటవీ అధికారులు ట్రాన్‌క్విలైజర్లను ప్రయోగించారు. నాలుగు ట్రాన్‌క్విలైజర్‌లను ప్రయోగించిన తర్వాత పులిని బంధించి సురక్షితంగా అడవుల్లోని తీసుకెళ్లారు. చిరుత పులి సంచారం కెమెరా కంటికి చిక్కడంతో సదరు వీడియో ఇప్పుడు సామాజకి మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. కాగా ఇటీవల యుపిలో లఖింపూర్‌ ఖేరి జిల్లాలో చిరుతపులి జనావాసాల్లో వచ్చి హల్‌ చల్‌ చేసింది.