జనవరి 8న ‘కవ్వింత విడుదల

 
జనవరి 8న ‘కవ్వింత విడుదల
అంజనీ మూవీస్‌ పతాకంపై విజ§్‌ు దాట్లా, దీక్షాపంత్‌ జంటగా త్రిపురనేని విజ§్‌ు చౌదరి దర్శకత్వంలో పువ్వల శ్రీనివాసరావు నిర్మిస్తున్నచిత్రం ‘కవ్వింత. ఈచిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జనవరి 8న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చిత్రం బృందం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. దర్శకుడువిజ§్‌ు చౌదరి మాట్లాడుతూ, ఫేక్‌ కరెన్సీ నేపథ్యంలో ఓ అందమైన విలేజ్‌లో జరిగే ప్రేమక కథే ఈసినిమా అన్నారు. ఫొటోగ్రఫీ, మ్యూజిక్‌ ఈచిత్రానికి ప్రత్యేకంగా ఉంటన్నారు. మొత్తం 5 పాటులు అందరూ కష్టపడి వర్క్‌ చేశారన్నారు. జనవరి 8న సినిమా విడుదలకు ప్లాన్‌ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మల్టీ డైమన్షన్‌ వాసు, త్రిపురనేని చిట్టిబాబు, విజ§్‌ు దాట్లా, తదితరులు మాట్లాడారు. ఇంకా ఈకార్యక్రమంలో ధనరాజ్‌, అంబటి శ్రీను, విజ§్‌ు తదితరులు పాల్గొన్నారు. మాటలు: నివాస్‌, లిరిక్‌్‌స: చైతన్య, వర్మ, కెమెరా: కార్తీక్‌ ఘట్టమనేని, శ్యాం తుమ్మలపల్లి, సంగీతం: సునీల్‌ కశ్యప్‌, ఎడిటింగ్‌ మధు, జి.రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ హరీష్‌ ప్రకాష్‌ నంది, సహనిర్మాత: తెంటు లక్ష్మునాయుడు, నిర్మాత: పువ్వల శ్రీనివాసరావు, కథ-స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: విజ§్‌ుచౌదరి త్రిపురనేని