జనవరి 31న శౌర్య ఆడియో విడుదల

 

Showrya
మంచు మనోజ్‌, రెజీనా జంటగా బేబి త్రిష సమర్పణలో సురక్ష్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ బ్యానర్‌పై దశరథ్‌ దర్శకత్వంలో శివకుమార్‌ మల్కాపురం నిర్మిస్తున్న చిత్రం శౌర్య. థ్రిల్లర్‌ లవ్‌ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం సినిమా చిత్రీకరణను పూర్తిచేసుకుని నిర్మానాంతర కార్యమ్రాలను జరుపుకుంటుంది. ఇటీవల విడుదల చేసిన సినిమా ఫస్ట్‌లుక్‌, టీజర్స్‌కు ఆడియెన్స్‌ నుండి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. వేదా.కె. సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని జనవరి 31 శిల్ప కళావేదికలో పలువురు సినీ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సినిమాలో మనోజ్‌ సాప్ట్‌వేర్‌ ఇంజనీర్‌ పాత్రలో ఇప్పటి వరకు చేయని డిఫరెంట్‌ లుక్‌తో కనపడనున్నాడు. దర్శకుడు దశరథ్‌కు ఉన్న క్లాస్‌ ఇమేజ్‌, మనోజ్‌కు ఉన్న మాస్‌ ఇమేజ్‌, ఈ రెండింటి కాంబినేషన్‌ లో రానున్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. సెన్సార్‌ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తిచేసి సినిమాను ఫిబ్రవరి రెండో వారంలో విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు. ప్రకాష్‌రాజ్‌, బ్రహ్మానందం, షాయాజీ షిండే, సుబ్బరాజు, నాగినీడు, శ్రవణ్‌, బెనర్జీ, జి.వి.ప్రభాస్‌శ్రీను, షకలక శంకర్‌, సత్యప్రకాష్‌, సూర్య, శివారెడ్డి, సుధ, మధుమణి, హేమ, సంధ్యాజనక్‌, చంద్రకాంత్‌, రూప ఇతర తారాగణం. ఈ చిత్రానికి స్టంట్స్‌: వెంకట్‌, కొరియోగ్రఫీ: బాను, ఆర్ట్‌: హరిబాబు, రచనా సహకారం: హరికష్ణ, సాయికష్ణ, స్క్రీన్‌ప్లే: గోపు కిషోర్‌, రచన: గోపి మోహన్‌, ఎడిటర్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, సంగీతం: వేదా.కె. సినిమాటోగ్రఫీ: మల్హర్‌ భట్‌ జోషి, నిర్మాత: శివకుమార్‌ మల్కాపురర, దర్శకత్వం: దశరథ్‌.