జనవరి 10న ‘సీతమ్మ అందాలు..రామయ్య సిత్రాలు పాటల వేడుక

 

జనవరి 10న ‘సీతమ్మ అందాలు..రామయ్య సిత్రాలు పాటల వేడుక
రాజ్‌తరుణ్‌ హీరోగా నటిస్తున్న సీతమ్మ అందాలు.. రామయ్య సిత్రాలు.. షూటింగ్‌ పూర్తిచేసకుని నిర్మాణానంతర కార్యక్రమాల్లో బిజీగాఉంది. ఈచిత్రానికి గవిరెడ్డి దర్శకుడు. శ్రీశైలేంద్ర ప్రొడక్షన్స్‌ పతాకంపై శ్రీమతి పూర్ణిమ ఎస్‌.బాబు ,సమర్పణలో ఎస్‌.శఃలేంద్రబాబు , కెవి శ్రీధర్‌రెడ్డి , హరీష్‌ దుగ్గిశెట్టి ఈచిత్రాని నిర్మిస్తున్నారు. ఈ సందర్బ:గా నిర్మాతలు మాట్లాడుతూ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈచిత్రంలో సున్నితమైన భావోద్వేగాలకు , వినోదానికి పెద్దపీట వేశామన్నారు. రాజ్‌తరుణ్‌ పాత్ర సరికొత్తగా ఉంటుందన్నారు. అర్తన అనే నూతన హీరోయిన్‌ ఈచిత్రం ద్వారా పరిచయం కాబోతోందన్నారు. జనవరి 10న ఆడియో విడుదలచేసి, జనవరి 3వ వారంలో చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. రాజారవీంద్ర, ఆదర్శ్‌, షకలక శంకర్‌, మధునందన్‌, విజ§్‌ు జోగినాయుడు, సురేఖావాణి, శ్రీలక్ష్మి , హేమ, రత్నసాగర్‌ ,నవీన్‌, భార్గవితదితరులు ప్రధాన తారాగణం.