జనవరి 1, 2019న ఎంతమంది పుట్టారో చెప్పిన యునిసెఫ్!

breaking news
breaking news
న్యూఢిల్లీ: కొత్త సంవత్సరం వచ్చేసింది. కోటి కాంతులతో ప్రపంచమంతా 2019 సంవత్సరానికి స్వాగతం పలికింది. ఈ సందర్భంలో భారత్‌లో జనవరి 1, 2019న జన్మించిన పిల్లలెంత మంది ఉన్నారో యునిసెఫ్ అధికారికంగా వెల్లడించింది. యునిసెఫ్ గణాంకాల ప్రకారం.. భారత్‌లో ఈ కొత్త సంవత్సరం ఆరంభ తేదీ నాడు మొత్తం 69, 944 మంది పిల్లలు పుట్టారు. ప్రపంచవ్యాప్తంలో ఈ విషయంలో ఇండియానే నంబర్ వన్ ప్లేస్‌లో నిలవడం విశేషం. భారత్ తర్వాత చైనాలో 44,940 మంది, నైజీరియాలో 25,685 మంది పిల్లలు కొత్త సంవత్సరానికి స్వాగతం పలికినట్టు యునిసెఫ్ తెలిపింది. అంతేకాదు, ఇవాళ పుట్టిన వారికి చాలా దేశాల్లో అలెగ్జాండర్, ఆయేషా, జైనాబ్స్, జిక్వాన్స్ అని నామకరణం చేసినట్లు యునిసెఫ్ పేర్కొంది.