జనవరి లో ‘మన్మథుడు 2’ సెట్స్ మీదకు

Akkineni Nagarjuna
Akkineni Nagarjuna

కింగ్ నాగార్జున ప్రస్తుతం మరో రెండు మల్టీ స్టారర్ చిత్రాల్లో నటిస్తున్నారు. దాంట్లో ఒకటి హిందీలో తెరకెక్కుతున్న ‘బ్రహ్మాస్త్ర’ కాగా మరొకటి ధనుష్ తెరకెక్కిస్తున్న తమిళ చిత్రం. ఇక నాగ్ తెలుగులో ఇంత వరకు తన కొత్త చిత్రాన్ని ప్రకటించలేదు. అయితే చిత్ర వర్గాల నుండి వస్తున్న సమాచారం ప్రకారం  రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగ్ తన కొత్త చిత్రంలో నటించనున్నాడట. సూపర్ హిట్ మూవీ ‘మన్మథుడు’ కి సీక్వెల్ గా ‘మన్మథుడు 2’ అనే టైటిల్ తో ఈచిత్రం తెరకెక్కనుందట. జనవరి లో ఈచిత్రం సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని సమాచారం.