జడ్జిల నియామకంలో ముదురుతున్న వివాదం

                  జడ్జిల నియామకంలో ముదురుతున్న వివాదం

 court
court

కేంద్ర ప్రభుత్వానికి, దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఉత్తరాఖండ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కెఎం జోసెఫ్‌ (59)ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాల ని సిజేఐ నేతృత్వంలోని కొలీజియం సిఫార్సు చేసింది. ఈ సిఫా ర్సులను కేంద్రం తిప్పి పంపింది. దీనికి కేంద్రం చెప్పిన సమాధా నం కొలీజియం ప్రతిపాదనలు సుప్రీంకోర్టు విధించిన పరిమితులకు లోబడి లేదని, సుప్రీంకోర్టులో కేరళ నుండి ప్రాతినిధ్యం ఉందని స్పష్టం చేసింది. జస్టిస్‌ జోసెఫ్‌ కన్నా అనేక మంది హైకోర్టు సిజే లు, సీనియర్‌ జడ్జిలు సీనియారిటీలో ముందున్నారు. కేంద్ర ప్రభు త్వ నిర్ణయాన్ని కొలీజియం చీఫ్‌గా వ్ఞన్న సీజేఐ జస్టిస్‌ మిశ్రా మద్ద తు ఇచ్చారు. చివరికి సుప్రీం న్యాయమూర్తిగా ఇందూ మల్హోత్రాను నియమించారు. సీజేఐ కేంద్రప్రభుత్వానికి, ముఖ్యంగా బిజెపి ప్రభు త్వానికి అనుకూలంగా ఉంటున్నారని, బిజెపి అనుకున్న విధంగా ప్రధానమైన కేసులను జస్టిస్‌ దీపక్‌ మిశ్రా తనకు అనుకూలమైన బెంచ్‌లకు ఇస్తున్నట్టు, కొలీజియంలోని మిగిలిన నలుగురు సభ్యులు ఆరోపించారు. జనవరిలో కొలీజియం సీనియర్‌ న్యాయవాది ఇందూ మల్హోత్రా, జస్టిస్‌ జోసెఫ్‌లను సుప్రీం న్యాయమూర్తులుగా నియ మించాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. కొలీజియం అనుమతి లేకుండా సిఫార్సులను వేరుచేయకూడదని2014లో అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్‌ఎం లోధా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అప్పుడు కూడా కొలీజియం మాజీ సొలిసిటర్‌ జనరల్‌ గోపాల సుబ్రహ్మణియంను సుప్రీం న్యాయమూర్తిగా నియమించాల ని కేంద్రానికి సిఫార్సు చేసింది. సీనియారిటీ ప్రధాన పాత్ర అని కేంద్రం చెపుతోంది.

కాని సినీయారిటీని కాదని కొలీజియం, కేంద్రం అనేక సార్లు న్యాయమూర్తులకు పదోన్నతులను కల్పించాయి. ఉదా హరణకు జస్టిస్‌ జోసెఫ్‌ సీనియారిటీలో 42వ స్థానంలో ఉన్నారు. వీరికంటే ముందు వరుసలో వివిధ హైకోర్టుల్లో 11 మంది ప్రధాన న్యాయమూర్తులు సీనియారిటీలో ఉన్నారు. అలాగే ప్రాక్టీసు అడ్వ కేట్లు చాలా మంది ఇందూ మల్హోత్రాకన్నా ముందు ఉన్నారు. అయి నా 2007లో సీనియర్‌ న్యాయవాది హోదా పొందిన మల్హోత్రానే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించారు. భారత న్యాయవ్యవస్థ ప్రమాదంలో ఉంది. తన స్వతంత్రను కాపా డుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. న్యాయవ్యవస్థలోని న్యాయమూర్తులందరూ ఒకే తాటిపై నిలబడకపోయినా మెజారిటీ న్యాయమూర్తులు అయినా నిలబడాల్సిఉంది.మోడీ ప్రభుత్వం న్యాయవ్యవస్థకు అతీతంగా ప్రవర్తిస్తోందని కాంగ్రెస్‌ విమర్శిస్తోంది. జస్టిస్‌ జోసెఫ్‌ నియామకం నిలుపుదల వెనుక ఆయన ప్రాంతీయ త, మతం, ఉత్తరాఖండ్‌ కేసులో ఆయన ఇచ్చిన తీర్పు అనే అంశా లపై స్పష్టం చేయాలని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. కార్యనిర్వాహక వ్యవస్థ న్యాయవ్యవస్థ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవచ్చని కేంద్రం చెపుతుంది. మరోవైపు కేంద్రం సుప్రీంకోర్టు తీర్పు, పద్ధ్దతు ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని తాజా సిఫార్సుల వల్ల హెచ్చ రించినట్లయింది.నిజానికి కేంద్రం సీనియారిటీ జాబితాలోని న్యాయ మూర్తుల ప్రవర్తన, పనితీరుపై తీవ్ర ఆరోపణలు ఉన్నప్పుడే కొలీజి యం సిఫార్సులను తిప్పి పంపి తిరిగి పరిశీలించాలని చెప్పవచ్చు.

ఉత్తరాఖండ్‌లో విధించిన రాష్ట్రపతిపాలన చెల్లదని గతంలో జస్టిస్‌ జోసెఫ్‌ తీర్పు చెప్పారు. ఆ తీర్పు బిజెపికి వ్యతిరేకంగా ఉండబట్టే కేంద్రం అలా ప్రవర్తిస్తోందని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు. అందరికీ న్యాయం అందించే న్యాయమూర్తులు, ఎందుకు సంక్షోభంలో చిక్కుకున్నారు. న్యాయవ్య వస్థ, కార్యనిర్వహక వ్యవస్థతో తన అవసరాల రీత్యా రాజీపడుతోం దా,సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపాత్ర కీలుబొమ్మలాగా ఎందు కు తయారైంది. న్యాయవ్యవస్థను రక్షించడానికే కాంగ్రెస్‌ (లోక్‌సభ లో 10 శాతం కూడా లేరు) సీజీఐ అభిశంసన తీర్మానం పెట్టింది. న్యాయవ్యవస్థపై పట్టుకోసం ప్రధాన పార్టీలు మధ్య వైరుధ్యాలు వస్తున్నాయి. కేంద్రం కొలీజియం పెత్తనానికి చెక్‌పెట్టేదానికి జాతీయ న్యాయనియామకాల కమిషన్‌ ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఈ చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. ప్రధాన న్యాయమూర్తిపై భారత దేశంలోని ప్రతిపక్షానికి నమ్మకం లేకపోవడం, జడ్జి లోయా మృతి కేసు, వైద్యకళాశాలల కేసు విషయాల వల్ల ప్రజలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై విశ్వాసం సన్నగిల్లింది. న్యాయమూర్తులను కొలీజియం సిఫార్సు మేరకే నియమించడానికి కేంద్రం ఒప్పుకోవడం లేదు. హైకోర్టు జడ్జి పదవీకాలానికి కొలీజియం సిఫార్సులను సైతం కేంద్రం ఒప్పుకోలేదు. తదుపరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గోగో§్‌ు నియామకానికి కేంద్రం ఆమోదం తెలుపు తుందా లేదా అనేసంశయం వస్తోంది. న్యాయవ్యవస్థ ప్రయోజనాల వ్యాజ్యాలకు ప్రాముఖ్యత ఇస్తోంది.

మరోవైపు వేలకొద్దీ కేసులు సుప్రీంకోర్టులో పెండింగ్‌లోఉన్నాయి. ముఖ్యంగా మెజారిటీ ప్రజానీ కానికి చెందిన భావజాలానికి అనుకూలంగా తీర్పులు వస్తున్నాయి. ఎస్సీ,ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టానికి సుప్రీంకోర్టు సవరణలు ప్రతిపాదించడం వెనుక కూడా న్యాయమూర్తుల ప్రయోజనాలు కాపాడుకునే ప్రయత్నం జరిగిందనే వాదనలు వస్తున్నాయి. లోయా మృతి కేసుకు సంబంధించిన పిల్‌ను సుప్రీంకోర్టు ఆదిలోనే తోసిపు చ్చింది. ఈ అంశాల విషయంలో సుప్రీంకోర్టుపై ప్రజల్లో వ్ఞన్న సామాజిక అంగీకారం దెబ్బతింది. రెండు దశాబ్దాలుగా పైగా కొలీ జియం వ్యవస్థ నడుస్తోంది. ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ ప్రతినిధులకు ప్రాతినిధ్యం వహించే పార్లమెంట్‌ నియంత్రణలో కొలీ జియం ఉండాలని వాదించే ప్రజాస్వామిక వాదులు ఉన్నారు. అలాగే న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడటానికి కొలీజియం అవ సరమని, దీనిపై కేంద్ర ప్రభుత్వ పెత్తనం ఉండకూడదని చెప్పేవాళ్లు ఉన్నారు.అయితే కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో రెండు వ్యవస్థలు ప్రజల్లో కోల్పోయిన విశ్వాసాన్ని పెంచుకోవాలి. సుప్రీం కోర్టు సంక్షోభం నవంబరు 9,2017న తారాస్థాయికి చేరింది. మెడికల్‌ అడ్మిషన్‌ స్కాంలో ఒక ఎన్జీవో సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టులోని ఐదుగురు అత్యంత సీనియర్‌ జడ్జిలతో కూడిన ధర్మాసనానికి అప్పగిస్తూ నవంబర్‌ 10న ఆదేశాల కు జస్టిస్‌ చలమేశ్వర్‌ అభ్యంతరం లేవదీశారు. కేసులో జస్టిస్‌ దీపక్‌ మిశ్రా ప్రమేయం ఉన్నందున ధర్మాసనంలో ఆయన ఉండకూ డదని పిటిషనర్‌ కోరాడు.

నవంబర్‌ 10న ఆ ఆదేశాలను జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులు, ధర్మాస నం ఏర్పాటు అధికారం సిజేఐకే ఉంటుందని ద్విసభ్య, త్రిసభ్య ధర్మాసనాలు కేసును తమ బెంచ్‌కుగాని, రాజ్యాంగ ధర్మసనాలకు గానీ కేటాయించలేవనీ స్పష్టీకరించారు. జనవరి 11,2018న సీని యర్‌ న్యాయవాది ఇందు మల్హోత్రా, ఉత్తరాఖండ్‌ ప్రధాన న్యాయ మూర్తి కెఎం జోసఫ్‌ పేర్లను సుప్రీం జడ్జీలుగా కొలీజియం సిఫార్సు చేసింది. జనవరి 12న కేసుల కేటాయింపులో సిజేఐ వైఖరిని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్‌ న్యాయమూర్తులు జస్టిస్‌ చలమేశ్వర్‌, జస్టిస్‌ రంజన్‌ గోగో§్‌ు, జస్టిస్‌ మదన్‌ బి.లోకూర్‌, జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో చెప్పారు. మార్చి 21న న్యాయవ్యవస్థలో కార్యనిర్వహక వ్యవస్థ జోక్యంపై ఫుల్‌ బెంచ్‌ ఏర్పాటు చేయాలని సిజేఐకు జస్టిస్‌ చలమేశ్వర్‌ లేఖ రాశారు. ఏప్రిల్‌ నెలలో జనవరి 11న కొలీజియం చేసిన సిఫార్సు లపై కేంద్రం జాప్యాన్ని తప్పుపడుతూ సిజేఐకి జస్టిస్‌ జోసెఫ్‌ కురియన్‌ లేఖ రాశారు.ఏప్రిల్‌ 11న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి సమానుల్లో ప్రధముడని, కేసుల కేటాయింపు, కేసుల విచా రణకు ధర్మాసనాల ఏర్పాటుకు సంబంధించి రాజ్యాంగపరమైన విశి ష్టాధికారం ఆయనకే ఉంటుందని జస్టిస్‌ దీపక్‌ మిశ్రా ధర్మాసనం తీర్పునిచ్చింది. ఈ పరిణామాలన్నీ సుప్రీంకోర్టు సంక్షోభాన్ని తెలుపు తాయి. ప్రతిపక్షాలు సిజేఐపై అభిశంసన తీర్మానం పెట్టారు. బిజెపికి అనుకూలమైన వ్యక్తిగా సిజేఐ ముద్రపడ్డారు. కొలీజియం ఉనికిని కేంద్రం ప్రశ్నార్థకం చేయనుంది. ఎవరు గొప్పా అనే విషయాన్ని పక్కన పెడితే ఈ ఆధిపత్య శక్తులు ఏ ప్రయోజనాన్ని ఆశించి ఘర్షణ పడుతున్నాయో అర్థం చేసుకుంటే విషయం తెలుస్తుంది.

ఎం.కె.కుమార్‌