జగ్గయ్యపేట కౌన్సిల్‌లో ఆందోళన

TDP
TDP

జగ్గయ్యపేట కౌన్సిల్‌లో ఆందోళన

స్థానిక మునిసిపల్‌ చైర్మన్‌ ఎన్నికలో నాటకీయ వాతావరణం నెలకొంది. తమ పార్టీకి చెందిన కౌన్సిలర్లను అపహరించారంటూ తెదేపా నేతలు కౌన్సిల్‌ హాల్లో ఆందోళన చేపట్టారు. కిడ్నాపైన ఇద్దరు సభ్యుల్ని తీసుకొచ్చేవరకు ఎన్నిక జరగనివ్వమంటూ నినాదాలుచేస్తూ ఎంపి కేశినేని నాని, తెదేపా కౌన్సిలర్లు పోడియం ఎదుట బైఠాయించి, ఎన్నికల అధికారుల మైక్‌ను లాగేశారు. దీంతో అధికారులు ఎన్నికలు జరపాలో…ఆపివేయాలో అన్న సందిగ్ధంలో ఉన్నారు. కాగా కార్యాలయం వద్ద ఉన్న ఓ ద్విచక్ర వాహనానికి దుండగులు నిప్పు పెట్టడంతో ఆ వాహనం పాక్షికంగా దగ్ధమయ్యింది.