జగిత్యాల జిల్లాలో కరోనా కేసు

అప్రమత్తమైన అధికారులు

corona virus.
corona virus.

జగిత్యాల: గత కొద్ది రోజులుగా కరోనా కేసులు నమోదు కాని జగిత్యాల జిల్లాలో నిన్న ఒక కరోనా కేసు నమోదు అయింది. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ఓ గ్రామంలో కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. దీంతో ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ ఆ గ్రామానికి చేరుకుని ఆ గ్రామాన్ని కంటైన్‌ మెంట్‌ జోన్‌గా ప్రకటించి కరోనా నివారణ చర్యలు ప్రారంభించారు. గ్రామంలో హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారి చేశారు. గ్రామంలో ఇద్దరు వైద్యలతో పాటు, ఆరుగురిని హోం క్వారంటైన్‌ చేశారు. మరో నలుగురిని క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు. అనుమానితుల నమూనాలను సేకరించి పరీక్షలకు పంపుతున్నట్లు తెలిపారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/